సొంత రాష్టం పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన పైర్ బ్రాండ్!

ఇలాంటి సామాజిక సమస్యలపై సెలబ్రిటీలు , రాజకీయ నాయకులు బహిరంగంగా గళం విప్పడం ద్వారా ప్రజల్లో అవగాహన పెరుగుతుందని కంగ‌న అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Update: 2026-08-12 06:05 GMT

బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో .. సామాజిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కంగ‌న‌ స్వరాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో ఆడపిల్లల పుట్టుకను స్వాగతించని సంకుచిత మనస్తత్వం ఇప్పటికీ కొనసాగుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హిమాచల్‌లో మహిళల పట్ల, ఆడపిల్లల పట్ల ఉన్న వివక్షాభరిత ధోరణి అత్యంత దారుణంగా ఉందని సంచలన ఆరోపణలు చేశారు. సమాజంలో ఆధునికత ఎంత పెరుగుతున్నా? కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ పురుషాధిక్య భావజాలం బలంగా వేళ్లూనుకుపోయిందని కంగనా పేర్కొన్నారు.

కుటుంబంలో మగ సంతానం కావాలనే బలమైన కోరిక కారణంగా ఆడపిల్లలను చిన్నచూపు చూసే ధోరణి ఆ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. మహిళా సాధికారత గురించి ఎంత మాట్లాడుకున్నా? అట్టడుగు స్థాయిలో ఇంకా ఈ రకమైన ఆలోచనా విధానం మారకపోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. ఒక మహిళగా, ప్రజా ప్రతినిధిగా తాను సొంత రాష్ట్రంలోనే ఇలాంటి చేదు అనుభవాలను, సామాజిక రుగ్మతలను గమనించానని కంగనా వెల్లడించారు. ఆడపిల్లలను భారంలా భావించే ఇలాంటి సంస్కృతి మారాలని, అప్పుడే నిజమైన సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు.

స్త్రీల పట్ల వివక్షను ప్రదర్శించే ఇలాంటి మనస్తత్వాలు దేశ ప్రగతికి ఎంతైనా ఆటంకం అని అభిప్రాయపడ్డారు.కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా .. సామాజికంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. కంగ‌న విమ‌ర్శ‌ల‌ను కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు సొంత రాష్ట్రంపైనే ఒక ప్రజా ప్రతినిధి ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం తగదని మండిపడుతున్నారు. ఏది ఏమైనా? దశాబ్దాలుగా మరుగున పడిపోయిన సున్నితమైన అంశాన్ని కంగ‌న ధైర్యంగా తెరపైకి తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇలాంటి సామాజిక సమస్యలపై సెలబ్రిటీలు , రాజకీయ నాయకులు బహిరంగంగా గళం విప్పడం ద్వారా ప్రజల్లో అవగాహన పెరుగుతుందని కంగ‌న అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆడపిల్లల భద్రత, వారి విద్య , హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు, సమాజం సంయుక్తంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ వివాదం మరోసారి నిరూపించింది. అయితే అంశం కేవలం హిమాచల్ ప్రదేశ్‌కే పరిమితం కాలేదు. యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. లింగ వివక్షకు వ్యతిరేకంగా సమాజంలో సమూలమైన మార్పు రావాల్సిన అవసరాన్ని కంగ‌న వ్యాఖ్యలు మరోసారి బ‌లంగా గుర్తు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో చట్టాలు చేయడం ద్వారానే కాకుండా ప్రజల మానసిక స్థితిగతులలో, ఆలోచనా విధానంలో మార్పు వచ్చినప్పుడే లింగ వివక్షకు శాశ్వత చెక్ పెట్టగలమని సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆడపిల్లలను సమానంగా చూడటమే కాకుండా వారికి అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించినప్పుడే సమాజం నిజమైన ప్రగతిని సాధిస్తుందని కంగనా వ్యాఖ్యలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.

Tags:    

Similar News