స్టార్ హీరో స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్!
విశ్వనటుడు కమల్ హాసన్ కి 'విక్రమ్' తర్వాత సరైన సక్సెస్ పడని సంగతి తెలిసిందే.;
విశ్వనటుడు కమల్ హాసన్ కి 'విక్రమ్' తర్వాత సరైన సక్సెస్ పడని సంగతి తెలిసిందే. 'కల్కి 2898'లో నటించినా? అది పేరుకే. కమల్ నట విశ్వరూపం 'కల్కి 2'లో ఉంటుంది. అంత వరకూ కల్కిలో ఆయన ఉన్నా? లేనట్లే. గత ఏడాది రిలీజ్ అయిన 'ఇండియన్ 2' తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఇటీవలే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'థగ్ లైఫ్' కూడా నీరు గార్చేసింది. దీంతో కమల్ ఇప్పుడు మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. తొందర పడి ఏ సినిమాకు కమిట్ అవ్వలేదు.
రంగంలోకి స్టంట్ మాస్టర్:
సొంత బ్యానర్లో ఇతర హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నారు తప్ప! తాను మాత్రం సరైన కంటెంట్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ మధ్య స్టంట్ మాస్టర్ అన్బు అరీవ్ స్టోరీపై కమల్ పాజిటివ్ గా స్పందిచినట్లు ప్రచారంలోకి వచ్చింది. తాజాగా ఈ ప్రాజెక్ట్ కన్పమ్ అయింది. అన్బు అరీవ్ నేరేట్ చేసిన స్టోరీని కమల్ పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నారు. సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ లోనే నిర్మాణానికి రెడీ అవుతున్నారు. ఈ కథ కమల్ కొన్ని నెలల క్రితమే ఉన్నా? ఇంత కాలం హోల్డ్ లో పెట్టి తాజాగా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
తొలి స్టైలిష్ ఎంటర్ టైనర్:
దీంతో ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా చిత్రాన్ని పట్టాలెక్కించే దిశగా ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఈనెల మూడవ వారంలో సినిమా ప్రారంభించాలని ప్రణాళిక సిద్దం చేస్తున్నారట. కమల్ హాసన్ మాత్రం అక్టోబర్ నుంచి డేట్లు ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. విదేశాల్లో పనులు ముగించుకుని ఆక్టోబర్ నుంచి సెట్స్ కు వెళ్లనున్నారట. ఇదొక స్టైలిష్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలిసింది. కమల్ పాత్ర చాలా స్టైలిష్ గా ఉంటుందిట. ఇంతటి స్టైలిష్ ఎంటర్ టైనర్ లో కమల్ మునుపెన్నడు కనిపించలేదని .. ఆయన కెరీర్ లో తొలి స్టైలిష్ సినిమా ఇదే అవుతుందంటున్నారు.
అభిమానులకు వెయిటింగ్ తప్పదు
కమల్ గెటప్ కూడా చాలా కొత్తగా ఉంటుందట. పాత్ర కోసం కమల్ కొంత బరువు కూడా తగ్గుతున్నారట. డిఫరెంట్ హెయిర్ స్టైల్.. .కాస్ట్యూమ్స్ లో కమల్ కనిపించనున్నారని చిత్ర వర్గాల నుంచి లీకులందుతున్నాయి. ఇందులో కమల్ వయసు..ఇమేజ్ కు తగ్గ స్టార్ హీరోయిన్ కోసం అన్వేషణ మొదలైనట్లు సమాచారం. బాలీవుడ్ సీనియర్ బ్యూటీలనే పరిశీలిస్తున్నారట. వాళ్లెవరన్నది? తెలియాలి. ఇప్పుడీ సినిమా సెట్స్ కు వెళ్తే రిలీజ్ వచ్చే ఏడాదే ఉంటుంది. అంతకు వరకూ అభిమానులకు వెయిటింగ్ తప్పదు.