'కల్కి 2898 ఏడి' సీక్వెల్ .. ఒక్కసారిగా హీట్ పెంచిన నాగ్ అశ్విన్
ప్రభాస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలను ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అతడు ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్` చిత్రంలో నటిస్తున్నాడు.
ప్రభాస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలను ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అతడు ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్` చిత్రంలో నటిస్తున్నాడు. దీంతో పాటు, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడి సీక్వెల్ చిత్రీకరణ తాజాగా ప్రారంభమైంది. ఈ సినిమాని శరవేగంగా పూర్తి చేస్తామని నాగ్ అశ్విన్ ప్రామిస్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...
కల్కి 2 కోసం ఇప్పటికే రెట్టించిన ఉత్సాహంతో ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ తీపికబురు అందించాడు. ఈ ప్రతిష్టాత్మక సైన్స్ ఫిక్షన్ డ్రామా రెండవ భాగం షూటింగ్ ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైందని నాగ్ అశ్విన్ అధికారికంగా వెల్లడించారు. జులై నుంచి ఎలాంటి విరామం లేకుండా నిరంతరాయంగా సుదీర్ఘ షెడ్యూల్స్ ప్లాన్ చేశామని.. వీలైనంత వేగంగా చిత్రీకరణను పూర్తి చేసేలా పక్కా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. నాగ్ అశ్విన్ స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తూ.. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందించిన `సింగ్ గీతం` చిత్రం జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన తాజా ఇంటర్వ్యూలోనే ఆయన `కల్కి-2898ఏడి` సీక్వెల్ ప్రణాళికలను షేర్ చేసారు.
గత ఇంటర్వ్యూలలో `కల్కి 2898 ఏడీ` సీక్వెల్ కథాంశం -పాత్రల పరిధి గురించి నాగ్ అశ్విన్ కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసారు. కల్కి రెండవ భాగంలో అమితాబ్ బచ్చన్ (అశ్వత్థామ), కమల్ హాసన్ (యాస్కి) పాత్రల మధ్య ఫేసాఫ్ పరాకాష్ఠలో ఉంటుందని తెలిపారు. అలాగే ప్రభాస్ పోషించిన భైరవ పాత్ర వెనుక ఉన్న అసలు నిజాలు.. కర్ణుడి చారిత్రక వైభవాన్ని, మహాభారత ఘట్టాలను ఈ సీక్వెల్ లో మరింత డెప్త్‌తో చూపిస్తారు. మూడవది దీపికా పదుకొణె జన్మనిచ్చే ఆ `దైవిక శిశువు` చుట్టూనే మొత్తం కథా గమనం తిరుగుతుంది. తొలి భాగంలో కేవలం కొన్ని నిమిషాలకే పరిమితమైన కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్ ఇందులో పూర్తి స్థాయి విలనిజంతో విశ్వరూపం చూపించబోతోంది. మొదటి భాగంలో మిగిలిపోయిన చాలా ప్రశ్నలకు.. కాంప్లెక్స్ క్యారెక్టర్ ఆర్క్స్‌కు ఈ సీక్వెల్ లో పూర్తి స్థాయి ముగింపు లభిస్తుంది.
మొదటి భాగంతో పోలిస్తే `కల్కి సీక్వెల్` ఊహకందని రీతిలో విజువల్స్ పరంగా.. కథా విస్తృతి పరంగా అత్యంత భారీతనంతో గ్రాండియర్ స్కేల్‌లో రూపుదిద్దుకోనుంది. తొలి భాగంలో కేవలం కాశీ, కాంప్లెక్స్, శంభల అనే మూడు ప్రపంచాలను మాత్రమే చూపించిన నాగ్ అశ్విన్... రెండవ భాగంలో యాస్కి సామ్రాజ్యమైన కాంప్లెక్స్ లోపలి అద్భుతాలను, ఆధునిక సాంకేతిక యుద్ధాలను మరింత విజువల్ ఫీస్ట్‌లా తీర్చిదిద్దనున్నారు. హాలీవుడ్ స్థాయి విఎఫ్ఎక్స్ (VFX) హంగులు, అత్యాధునిక గ్రాఫిక్స్ టెక్నాలజీని ఉపయోగించి అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సినిమా మేకింగ్ సాగనుంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సీక్వెల్ లో యాక్షన్ ఎపిసోడ్స్ .. లార్జర్-దన్-లైఫ్ ఎలిమెంట్స్ సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయబోతున్నాయి.
ఈ సీక్వెల్ నుంచి ప్రభాస్ అభిమానులు వందకు వంద శాతం హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన దైవిక విన్యాసాలను ఆశించవచ్చు. భైరవ పాత్రలోని అసలు సిసలైన వీరత్వాన్ని... కర్ణుడి శౌర్యాన్ని ఎలివేట్ చేసే భారీ యాక్షన్ బ్లాక్స్ ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కేవలం సైన్స్ ఫిక్షన్ మాత్రమే కాకుండా.. పురాణాల మేళవింపుతో ప్రభాస్ క్యారెక్టర్ గ్రాఫ్ పీక్స్‌కు వెళ్లేలా డిజైన్ చేసారని తెలుస్తోంది. నాగ్ అశ్విన్ మార్క్ నెరేషన్, విజువల్ గ్రాండియర్ ట్రీట్మెంట్.. ప్రభాస్ కటౌట్‌కు తగ్గ మాస్ ఎలివేషన్స్ కలగలిసిన ఈ సీక్వెల్ ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోనుందని ఫిలింనగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది.