న‌టి పిల్ల‌ల్ని ట్రోల్ చేస్తే కార్‌తో గుద్దించేస్తుంద‌ట‌

సోష‌ల్ మీడియా యుగంలో ట్రోలింగ్ స‌ర్వ సాధార‌ణంగా మారింది. ప్ర‌తి చిన్న అంశంపైనా చ‌ర్చ‌లు, కామెంట్లు తీవ్రంగా మారాయి. ఇటీవ‌ల స్టార్ కిడ్స్ పై ఘోర‌మైన ట్రోలింగ్ సాగుతోంది.;

Update: 2025-06-21 20:30 GMT

సోష‌ల్ మీడియా యుగంలో ట్రోలింగ్ స‌ర్వ సాధార‌ణంగా మారింది. ప్ర‌తి చిన్న అంశంపైనా చ‌ర్చ‌లు, కామెంట్లు తీవ్రంగా మారాయి. ఇటీవ‌ల స్టార్ కిడ్స్ పై ఘోర‌మైన ట్రోలింగ్ సాగుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో న‌ట‌వార‌సుల అంద‌చందాలు, విలాసాలు, లెగ‌సీ వైఫ‌ల్యాల‌పై టార్గెట్ చేస్తూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే త‌న పిల్ల‌ల‌ను ఎవ‌రైనా కించ‌ప‌రుస్తూ కామెంట్ చేస్తే సీనియ‌ర్ న‌టి కాజోల్ అయితే ఏం చేస్తుందో తెలుసా? ఇదే ప్ర‌శ్న కాజోల్ ని ప్ర‌శ్నించింది మీడియా.. దీనికి స్పందించిన ఈ మేటి క‌థానాయిక‌.. ``నా కార్ ఎదుట‌కు రావొద్ద‌ని చెబుతాను.. ఎందుకంటే మీదికి ఎక్కించి తొక్కించేస్తాను!`` అని స‌ర‌దాగా వార్నింగ్ ఇచ్చారు.

కాజోల్ ప్ర‌స్తుతం `మా` సినిమా ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నారు. ఈ హార‌ర్ థ్రిల్ల‌ర్ లో త‌న కుమార్తెను కాపాడుకునే త‌ల్లి పాత్ర‌లో కాజోల్ అద్భుతంగా న‌టించార‌ని ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. నిజ జీవితంలోను త‌న పిల్ల‌ల జోలికి వ‌స్తే కాజోల్ ఎలా ప్ర‌వ‌ర్తిస్తారు? అనేది ప్ర‌శ్న‌. ఒక‌ప్పుడు అస్స‌లు స‌హించే స్థితిలో లేన‌ని కాజోల్ తెలిపారు. ``పిల్ల‌ల‌ను కాపాడుకునే త‌ల్లిగా, ఒక‌ప్పుడు చాలా సీరియ‌స్ గా ఉండేదానిని... ఇప్పుడు కొంత కూల్ గా ఉన్నాన‌``ని కూడా కాజోల్ అన్నారు.

సోష‌ల్ మీడియాలు, ట్రోలింగ్ జీవితాల్లో చిన్న భాగం. దానికి బదులుగా సానుకూల అంశాలపై దృష్టి పెట్టాలని త‌న పిల్ల‌ల‌కు స‌ల‌హా ఇచ్చిన‌ట్టు కాజోల్ తెలిపారు. సోష‌ల్ మీడియాల్లో అలా మాట్లాడేవారు ఒక శాతం లేదా 0.1 శాతం మాత్ర‌మే ఉంటారు. ఆ వ్యాఖ్య‌ల్లో నిజ‌మెంతో ఎవ‌రికీ తెలీదు. అలాంటి వాటిపై కాదు..మీరు మంచిపై దృష్టి పెట్టాలి! అని కాజోల్ అన్నారు.

Tags:    

Similar News