దివాళా తీసిన సినీహీరోని ఆదుకున్న తెలివైన పెట్టుబడి!
ఈరోజుల్లో ఎకరాల భూమిని అమ్ముకున్నవారిని చూస్తున్నాం. వందల కోట్లు పోగొట్టుకుని దివాళా తీసిన వ్యాపార దిగ్గజాలు ఎందరో ఉన్నారు.;
ఈరోజుల్లో ఎకరాల భూమిని అమ్ముకున్నవారిని చూస్తున్నాం. వందల కోట్లు పోగొట్టుకుని దివాళా తీసిన వ్యాపార దిగ్గజాలు ఎందరో ఉన్నారు. సినిమా నిర్మాతలుగా ఉన్న ఆస్తులన్నీ సినీరంగానికే అంకితమిచ్చిన ప్రబుద్ధులను చూస్తున్నాం. అయితే ఒక లక్ష పెట్టుబడితో 100 కోట్లు సంపాదించిన ఒక రియల్ హీరో గురించి బయటి ప్రపంచానికి తెలిసింది తక్కువే. ఆ రియల్ హీరో - జాకీ ష్రాఫ్.
అతడికి విజయం సింపుల్‌గా దక్కలేదు. ఈరోజు ఉన్న స్థితిగతులు అంత సులువుగా వచ్చినవి కావు. దానికోసం అతడు చాలా చేయాల్సి వచ్చింది. ఎన్నో ఆశనిరాశల మధ్య, జయాపజయాల మధ్య కూడా అతడు బలంగా నిలబడ్డాడు. తన కుటుంబాన్ని నిలబెట్టుకున్నాడు. ఆర్థికంగా అసలు ఏమీ లేని స్థితి నుంచి అతడు ఈరోజు వంద కోట్ల ఆస్తిపరుడిగా ఎదిగాడు. ఆర్థికంగా నిరాశతో నీరుగారి ఉన్నప్పుడు, ఊహించని సంఘటనలు వారి విధిని మార్చాయి.
జాకీ ష్రాఫ్, అతడి కుటుంబం చాలా కాలం క్రితం `బూమ్` అనే సినిమాని నిర్మించింది. ఈ సినిమాతోనే కత్రిన కైఫ్ కథానాయికగా ఆరంగేట్రం చేసింది. కానీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టరైంది. దీంతో ష్రాఫ్ ఫ్యామిలీ ఆర్థికంగా నిండా మునిగిపోయింది. ఇక కోలుకోవడం కష్టమైన పరిస్థితి. కానీ ఆ సమయంలో ఆ కుటుంబాన్ని ఆదుకున్నది ఒకే ఒక్కటి. అది వారి తెలివైన పెట్టుబడి. అప్పుడే హాలీవుడ్ నుంచి సోనీ ఎంటర్ టైన్ మెంట్స్ భారతదేశంలో అడుగు పెడుతోంది. 1995లో సోనీ ఇక్కడ అడుగుపెడుతున్నప్పుడు ఈ సంస్థలో జాకీ ష్రాఫ్ కుటుంబం వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టింది. ఇది అద్భుతమైన అనుభవం అని కూడా జాకీ ష్రాఫ్ భార్య అయేషా ష్రాఫ్ చెబుతారు. ఇందులో బ్యాంకింగ్, టెలివిజన్ , కంప్యూటింగ్ వంటివి ప్రధాన వనరులు.
ఆ సమయంలో సోనీతో ఒప్పందం ఎలా కుదిరింది? అంటే.. పలువురు బాలీవుడ్ ప్రముఖులతో పాటు అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్‌లు హాజరు కాగా సోనీతో తమ ఒప్పందం కోసం అయేషా పెద్ద పార్టీ ఏర్పాటు చేసారు. పార్టీతో పాటు, ఈ సమావేశం పెద్ద సక్సెసైంది. అంతర్జాతీయ ప్రముఖులను ఆకట్టుకోవడంలో వారు సఫలమయ్యారు. వెంటనే ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాయి. ఇది మా జీవితంలో ఉత్తమ , అత్యంత లాభదాయకమైన ఒప్పందం అని అయేషా ష్రాఫ్ అన్నారు. గ్రూప్ నిబంధన, వ్యక్తిగత ఎంపిక కారణంగా వారు సంతోషంగా దేశం నుంచి వెళ్లారని అయేషా తెలిపారు.
ఈ డీల్ ద్వారా లాభం ఊహించలేనిది. అప్పట్లో రూ. లక్ష నుండి రూ. 100 కోట్ల వరకు ఆదాయం పెరిగింది. కానీ ఆ తర్వాత 2002 లో `బూమ్` అనే సినిమాని తెరకెక్కించినా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నిర్మాతలుగా తొలి చిత్రమిది. మొదటి అనుభవం దారుణమైనది. అమితాబ్ బచ్చన్ , జాకీ సహా పలువురు టాప్ స్టార్లు ఈ సినిమాలో నటించారు. భారీ తారాగణం ఉన్నా బాక్సాఫీస్ వద్ద ఈసినిమా విఫలమైంది. దీనివల్ల ఆ జంట దివాలా తీయాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కూడా సోనీలో పెట్టుబడి వారిని ఆదుకుంది.
1995లో సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ భారతదేశంలో ప్రారంభమై ఈరోజు గొప్ప స్థానంలో ఉంది. సోనీ అంతర్జాతీయ టీమ్‌ను సంతృప్తి పరిచే పార్టీ ఇవ్వడంలో ష్రాఫ్ కుటుంబం పెద్ద సక్సెస్ సాధించింది. ఆ రోజు లక్ష పెట్టుబడి భారీ రాబడిని పొంది దాదాపు రూ. 100 కోట్లుగా మారింది. 2002లో `బూమ్` డిజాస్టర్ అయింది. కానీ ష్రాఫ్ కుటుంబం తెలివైన పెట్టుబడి వారిని ఆదుకుంది. ష్రాఫ్ కుటుంబ పెట్టుబడి అందరికీ స్ఫూర్తివంతమైనది. ప్రతి ఒక్కరూ పెట్టుబడుల విషయంలో సరైన సమయంలో తెలివిగా ఆలోచించాలి.