సౌత్ ఇండ‌స్ట్రీ నేప‌థ్యం ట్రెండ్ మారింది!

ఒక‌ప్పుడు సినిమా నేప‌థ్యం అంటే? అమెరికా...లండ‌న్..న్యూయార్క్ పేర్లే వినిపించేవి. అక్క‌డ బ్యాక్ డ్రాప్ లోనే ఎక్కువ గా క‌థ‌లు న‌డిచేవేవి.;

Update: 2025-03-30 04:45 GMT

ఒక‌ప్పుడు సినిమా నేప‌థ్యం అంటే? అమెరికా...లండ‌న్..న్యూయార్క్ పేర్లే వినిపించేవి. అక్క‌డ బ్యాక్ డ్రాప్ లోనే ఎక్కువ గా క‌థ‌లు న‌డిచేవేవి. అందుకు కార‌ణంగా లేక‌పోలేదు. భార‌తీయులు ఎక్కువ‌గా ఆయా ప్రాంతాల్లో ఉండటంతో క‌నెక్టింగ్ బాగుంటుంద‌ని ఆ బ్యాక్ డ్రాప్ లోనే ద‌ర్శ‌క‌, ర‌చ‌యిత‌లు క‌థ‌లు రాసు కునేవారు. తెలుగు, త‌మిళ్ లో ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలొచ్చాయి.

అయితే ఇప్పుడా ట్రెండ్ మారింది. అమెరికా...లండ‌న్ ల‌ను వ‌దిలేసి ఇత‌ర దేశాల నేప‌థ్యాల‌ను తీసుకోవ‌డం మొద‌లు పెట్టారు. ఇటీవ‌ల రిలీజ్ అయిన `పుష్ప‌-2` ప‌రిచ‌య స‌న్నివేశాలే జ‌పాన్ బ్యాక్ డ్రాప్ లో సాగాయి. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ కి సంబందించిన యాక్ష‌న్ స‌న్నివేశాలు అక్క‌డా తెర‌కెక్కించి ప్రేక్ష కుల‌కు కొత్త అనుభూతిని పంచారు. `పుష్ప‌-3`లోనూ ఇదే కంటున్యూ చేయాల‌ని చేస్తున్నారు.

అంత‌ర్జాతీయ ప్రాజెక్ట్గా ప్లాన్ చేస్తోన్న నేప‌థ్యంలో జ‌పాన్ తో పాటు అద‌నంగా మ‌రో రెండు...మూడు దేశాల పేర్లు కూడా జోడించే అవ‌కాశం ఉంద‌ని రైట‌ర్ల బృందం నుంచి తెలిసింది. అలాగే చైనా బ్యాక్ డ్రాప్ లో గ‌తంలో కొన్ని సినిమాలు వ‌చ్చాయి. అయితే అక్క‌డ నేప‌థ్యాన్ని బ‌లంగా చెప్ప‌లేదు. ఇక‌పై ర‌చ‌యిత‌లు ఆ ఛాన్స్ మ‌రింత బ‌లంగా తీసుకోవ‌డానికి అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే వ‌రుణ్ తేజ్ `కొరియ‌న్ క‌న‌క‌రాజు` అనే సినిమా చేస్తున్నాడు.

మేర్ల పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈసినిమా షూటింగ్ కొరియా దేశాల్లో ప్లాన్ చేస్తున్నట్లు స‌మాచారం. కొరియ‌న్ దేశాల‌కు... క‌థ‌కు క‌నెక్టింగ్ ఉండ‌టంతోనే గాంధీ కొరియా వెళ్తున్నాడు. అలాగే చాలా సినిమాలు చైనా, జ‌పాన్, మలేషియా, ర‌ష్యా లాంటి దేశాల్లోనూ రిలీజ్ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కొంత క‌థ‌ని అక్క‌డ కూడా న‌డిపిస్తే బాగుంటుంది...మార్కెట్ ప‌రంగా క‌లిసొస్తుంది అన్న‌ది ఓ స్ట్రాట‌జీగా క‌నిపిస్తుంది.

Tags:    

Similar News