• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆగిపోయిన ఇళయరాజా బయోపిక్

ఆగిపోయిన ఇళయరాజా బయోపిక్

| ‘మహానటి’ సినిమా అద్భుత విజయం సాధించాక సినీ ప్రముఖుల బయోపిక్స్ తీయడం మీద ఫిలిం మేకర్స్ ఫోకస్ పెరిగింది.

By - Garuda Media
Update: 2025-08-31 19:30 GMT

‘మహానటి’ సినిమా అద్భుత విజయం సాధించాక సినీ ప్రముఖుల బయోపిక్స్ తీయడం మీద ఫిలిం మేకర్స్ ఫోకస్ పెరిగింది. ఈ క్రమంలో వివిధ భాషల్లో పలు చిత్రాలు అనౌన్స్ అయ్యాయి. కానీ తెలుగులో సంచలనం రేపుతుంది అనుకున్న ఎన్టీఆర్ బయోపిక్ నిరాశపరచడంతో ఈ సినిమాల ఊపు తగ్గింది. అయినా సరే.. తమిళ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా జీవిత కథను తెరపైకి తీసుకురావాలని ఓ నిర్మాణ సంస్థ ముందుకు వచ్చింది. ధనుష్‌ను ఇళయరాజా పాత్ర కోసం ఎంచుకున్నారు. సాని కాయితం, కెప్టెన్ మిల్లర్ చిత్రాలను రూపొందించిన అరుణ్ మాథేశ్వరన్‌ దర్శకుడిగా ఖరారయ్యాడు. గత ఏడాది ఘనంగా ఈ సినిమాను ప్రకటించారు. కానీ దీని తర్వాత ధనుష్ ఓకే చేసిన సినిమాలు ముందుకు కదులుతున్నాయి కానీ.. ఇళయరాజా బయోపిక్ మాత్రం పట్టాలెక్కడం లేదు. దీంతో ఈ సినిమాపై సందేహాలు నెలకొన్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఇళయరాజా బయోపిక్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారట. ఈ సినిమా తీయడానికి అనుకున్న బడ్జెట్‌ను లెక్కగట్టాక.. ఆ మేరకు బిజినెస్ చేసి సినిమాను లాభాల బాట పట్టించడం సాధ్యం కాదని నిర్ణయించుకున్నారట. ఇళయరాాజా సంగీతం అంటే పడిచచ్చేవాళ్లు కోట్లల్లో ఉన్నప్పటికీ.. ఆయన జీవిత కథను తెరపై చూడాలన్న ఆసక్తి అందరిలో ఉందా అన్నది సందేహమే అని.. దీన్ని కమర్షియల్‌గా వర్కవుట్ చేయడం కష్టమని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే ధనుష్, అరుణ్ మాథేశ్వరన్ వేరే ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయారు. ఇళయరాజా బయోపిక్‌ను పక్కన పెట్టినట్లు అధికారికంగా ప్రకటన రాకపోవచ్చు కానీ.. ఈ సినిమా ముందుకు కదిలే అవకాశాలు మాత్రం లేవని తెలుస్తోంది. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో ‘ఇడ్లి కడై’ అనే సినిమా చేస్తున్న ధనుష్.. దీని తర్వాత ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్‌తో అబ్దుల్ కలాం బయోపిక్ చేయబోతుండడం విశేషం.

Tags:    
  • IlayarajaBiopic 
  • Dhansh 
  • ArunMatheswaran 
  • Tollywood 
  • TamilCinema 
  • BiopicMovies 
  • MovieUpdate 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS