గాయపడ్డ సింహం తర్వాత.. పోరాట సింహం

ఈ రోజుల్లో ఒక సినిమా పెద్ద హిట్టయిందంటే ఆటోమేటిగ్గా సీక్వెల్స్ అనౌన్స్ చేసేస్తున్నారు.;

Update: 2026-04-30 11:30 GMT

ఈ రోజుల్లో ఒక సినిమా పెద్ద హిట్టయిందంటే ఆటోమేటిగ్గా సీక్వెల్స్ అనౌన్స్ చేసేస్తున్నారు. అంతే కాక ఒక సినిమా హిట్టవుతుందన్న ధీమాతో ముందే సీక్వెల్‌కు లీడ్ ఇవ్వడం కూడా కామన్ అయిపోయింది. అలా లీడ్ ఇచ్చిన సినిమాలన్నీ పక్కాగా వస్తాయని గ్యారెంటీ ఏమీ లేదు కానీ.. ధీమాగా సీక్వెల్స్ అనౌన్స్ చేయడం మాత్రం కొనసాగుతూనే ఉంటోంది. ఈ శుక్రవారం రిలీజ్ కాబోయే ‘గాయపడ్డ సింహం’ చిత్రానికి కూడా ఇలాగే సీక్వెల్ ప్రకటించబోతున్నట్లు సమాచారం. కొత్త దర్వకుడు కశ్యప్ శ్రీనివాస్ రూపొందించిన ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ కథానాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో యంగ్ హీరో శ్రీ విష్ణు ఒక ప్రత్యేక పాత్ర చేస్తున్నట్లు ట్రైలర్లోనే హింట్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. సినిమాలో తన పాత్ర చాలా స్పెషల్‌గా ఉంటుందని టీం అంటోంది. అది బాగా పేలుతుందని చెబుతున్నారు.

ఐతే జస్ట్ క్యామియోలా కాకుండా సెకండ్ పార్ట్‌కు లీడ్ ఇచ్చేలా ఈ పాత్రను తీర్చిదిద్దారట. చివర్లో ‘పోరాట సింహ’ పేరుతో సీక్వెల్‌కు లీడ్ ఇచ్చారట. అందులో శ్రీ విష్ణునే హీరోగా నటించబోతున్నాడట. శ్రీ విష్ణు పాత్ర గురించే కాక.. ఇందులో కొందరు టాప్ హీరోల పాత్రలతో చేసిన స్పూఫ్‌ల గురించి కూడా సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న దిల్ రాజు కూడా వీటి గురించి ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంకా సినిమాలో చాలా విశేషాలు ఉంటాయని.. కామెడీ వేరే లెవెల్లో ఉంటుందని కూడా అంటున్నారు. దర్శకుడు పవన్ సాధినేని సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రంలో తరుణ్ సరసన మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా నటించారు. జేడీ చక్రవర్తి ఇందులో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. సూర్యప్రకాశ్ జోస్యుల ఈ చిత్రానికి కథ అందించాడు.

Tags:    

Similar News