క్రైమ్ టచ్‌తో త్రివిక్రమ్ సినిమా? వెంకటేష్ కాస్టింగ్ వెనుక ట్విస్ట్ ఇదే
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్‌కు పండగ.;
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్‌కు పండగ. కానీ వీరిద్దరూ కలిసి చేస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాలో ఒక సీరియస్ క్రైమ్ డ్రామా ఉండబోతోందనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్‌లో సెన్సేషన్ అవుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు పెట్టింది పేరైన త్రివిక్రమ్, ఈసారి తన స్టైల్ మార్చి క్రైమ్ ఎలిమెంట్స్‌పై ఫోకస్ పెట్టడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఈ మూవీ అప్‌డేట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి...ఆ విజయాలు చూద్దాం..
క్రైమ్ వరల్డ్ నుండి వచ్చిన 'మున్నా భయ్యా':
ఈ సినిమాలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 'మిర్జాపూర్' సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దివ్యేందు శర్మ ఇందులో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. మున్నా భయ్యాగా తన నటనతో క్రైమ్ డ్రామాల్లో ఒక బెంచ్‌మార్క్ సెట్ చేసిన దివ్యేందు, ఇక ఇప్పుడు వెంకటేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం పెద్ద ట్విస్ట్. రామ్ చరణ్ 'పెద్ది'తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ నటుడు, త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు.
త్రివిక్రమ్ రూట్ మారుస్తున్నారా?:
త్రివిక్రమ్ సినిమాలు అంటే సాధారణంగా ప్రాసలు, ఆకట్టుకొనే లాజిక్ పదాలు, అందమైన ఇల్లు, పెద్ద కుటుంబం కనిపిస్తాయి. కానీ ఈ సినిమా టైటిల్‌లోనే ఆదర్శ కుటుంబం అని వున్నా,ఇందులో ఎదో స్పెషల్ స్టోరీ లైన్ ఉందేమో అని టాక్..దానికి కారణం మిర్జాపూర్ నటుడు యాడ్ అవ్వడం. ఇక ఇందులో డార్క్ క్రైమ్ ఎలిమెంట్స్ గట్టిగానే ఉన్నట్లు అనిపిస్తోంది. వెంకటేష్ ఇప్పటికే 'రానా నాయుడు' ద్వారా డార్క్ షేడ్స్‌లో నటించి మెప్పించారు,
శ్రీనిధి శెట్టి గ్లామర్.. హారిక అండ్ హాసిని మేజిక్:
కె.జి.ఎఫ్ భామ శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెకు టాలీవుడ్‌లో ఇది ఒక మంచి బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. ఇక హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2026 సమ్మర్ కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా సినిమాను చాలా రిచ్‌గా ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్.
వెంకటేష్ కాస్టింగ్ వెనుక మాస్టర్ ప్లాన్:
వెంకటేష్ కి ఉన్న క్లీన్ ఇమేజ్, దివ్యేందు శర్మకు ఉన్న క్రైమ్ ఇమేజ్.. ఈ రెండింటిని మిక్స్ చేసి ఏదో కొత్త మ్యాజిక్ చేయబోతున్నారు మన డైరెక్టర్. ఇక ఫ్యామిలీ అంతా కలిసి చూస్తూనే, సీటు అంచున కూర్చుని చూసేలా ఈ క్రైమ్ డ్రామాను డిజైన్ చేసినట్లు సమాచారం. అందుకే ఈ కాస్టింగ్ వెనుక త్రివిక్రమ్ ఒక పెద్ద స్కెచ్చే వేశారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
మొత్తానికి 'ఆదర్శ కుటుంబం' పేరుతో త్రివిక్రమ్ మనకు ఒక సరికొత్త 'క్రైమ్ ఫ్యామిలీ డ్రామా'ను తెస్తారేమో చూడాలి. దీనిపైన ఇంకా స్పష్టత రావాల్సి వుంది. ఇక అటు వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను, ఇటు క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే యూత్‌ను ఆకట్టుకోవడానికి ఈ మూవీ పక్కాగా రెడీ అవుతోంది. మరి 2026 వేసవిలో ఈ మూవీ ఎలాంటి బాక్సాఫీస్ విస్ఫోటనం సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.