హీరోయిన్ పాత్ర‌కు నో చెప్పిన హబ్బీ!

ఇటీవ‌లే రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం 'ధురంధ‌ర్' ఎంత పెద్ద విజ‌యం అందుకుందో తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా 1200 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది.;

Update: 2026-01-13 15:30 GMT

ఇటీవ‌లే రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం 'ధురంధ‌ర్' ఎంత పెద్ద విజ‌యం అందుకుందో తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా 1200 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ఒకే భాష‌లో రిలీజ్ అయి ఇన్ని కోట్లు వ‌సూళ్లు సాధించ‌డం ఆ చిత్రానికే చెల్లింది. ఆ ర‌కంగా సింగిల్ లాంగ్వెజ్ స‌క్స‌స్ గా బాలీవుడ్ పేరు మ‌రోసారి దేశ వ్యాప్తంగా మారు మ్రోగిపో తుంది. సౌత్ సినిమాలో పాన్ ఇండియాలో రిలీజ్ అయి అలాంటి విజ‌యాలు న‌మోదు చేస్తే 'ధురంధ‌ర్' మాత్రం హిందీలోనే అన్ని భాష‌ల్ని షేక్ చేసింది. ర‌ణ‌వీర్ సింగ్ స‌హా ప్ర‌తీ పాత్ర ఎంతో గొప్ప‌గా పండింది.

ఇందులో హీరోయిన్ గా 18 ఏళ్ల సారా అర్జున్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. 40 ఏళ్ల న‌టుడితో అంత వయ‌సు వ్య‌త్యా సం ఉన్న న‌టి ఏంట‌నే విమ‌ర్శ‌లొచ్చానా రిలీజ్ త‌ర్వాత ఆ విమ‌ర్శ‌లెక్క‌డా క‌నిపించ‌లేదు. అయితే ఇదే పాత్ర‌లో న‌టించ‌డానికి తొలుత ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్ స‌తీమ‌ణి, న‌టి యామీ గౌత‌మ్ ముందుకొచ్చిందట. సినిమాలో హీరోయిన్ పాత్ర న‌చ్చ‌డంతో తానే పోషిస్తాన‌ని ఛాన్స్ త‌న‌కే ఇవ్వండ‌ని అడిగిందిట‌. ఈ విష‌యాన్ని యామీ గౌత‌మ్ స్వ‌యంగా రివీల్ చేసింది. కానీ అందుకు ఆదిత్య ధ‌ర్ అంగీక‌రించ‌లేదు.

తాను రాసిన పాత్ర‌కు ఓ ఫ్రెష్ హీరోయిన్ స‌హా వ‌య‌సు త‌క్కువ ఉన్న న‌టి అయితేనే బాగుంటుంద‌ని భావించ‌డంతో ఆ ఛాన్స్ యామీ గౌత‌మ్ కోల్పోయింది. త‌మ‌న్నా కూడా `ధురంధ‌ర్` లో పెర్పార్మెన్స్ చేయాల్సిందే. సినిమాలో షరరాత్ అంటూ సాగే ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. హీరో, హీరోయిన్ల పెళ్లి సందర్భంలో ఈ సాంగ్ వస్తుంది. ఇందులో ఆయేషా ఖాన్, క్రిస్టల్ స్టెప్పలేశారు. అయితే మొదట ఈ స్పెషల్ సాంగ్ కోసం తమన్నాను అనుకున్నారు. `జైలర్`, `స్త్రీ 2`, `రైడ్ 2` తదితర సినిమాల్లో మిల్కీ బ్యూటీ చేసిన స్పెషల్ సాంగ్స్ బాగా హిట్ అయ్యాయి.

దీంతో తమన్నాతోనే షరారత్ సాంగ్ చేయించాలని కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ అనుకున్నాడు. కానీ అందుకు ఆదిధ్య ధ‌ర్ అంగీక‌రించ‌లేదు. త‌మ‌న్నా పెర్పార్మెన్స్ చేస్తే రెగ్యుల‌ర్ గా ఉంటుంద‌ని..ముస్లీమ్ క‌ల్చ‌ర్ లో వ‌చ్చే సాంగ్ కి అలాంటి వాతావ‌ర‌ణం కావాలంటే? అయేషా ఖాన్, క్రిస్ట‌ల్ అయితేనే నూరు శాతం న్యాయం చేస్తార‌ని త‌మ న్నాను ప‌క్క‌న బెట్టి తీసుకున్నారు. క్యాస్టింగ్ విష‌యంలో అదిత్య ధ‌ర్ ప‌క్కాగా బ్యాలెన్స్ చేసాడు. అందుకే సినిమా అంత పెద్ద స‌క్సెస్ అయింది.

Tags:    

Similar News