గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న దేవియాని శర్మ!
ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమా సెలబ్రిటీలు తమ ఉనికిని చాటుకోవడానికి సోషల్ మీడియాను అతిపెద్ద ప్లాట్ఫారం గా చేసుకుంటున్నారు.;
ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమా సెలబ్రిటీలు తమ ఉనికిని చాటుకోవడానికి సోషల్ మీడియాను అతిపెద్ద ప్లాట్ఫారం గా చేసుకుంటున్నారు. సినిమాలలో అవకాశాలు వచ్చిన రాకపోయినా ఇటు సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. అందులో భాగంగానే ఎంతోమంది గ్లామర్ ప్రదర్శిస్తూ అభిమానులలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నారని చెప్పాలి . ఈ క్రమంలోనే తన అందంతో, అభినయంతో ఎప్పటికప్పుడు ట్రెండీ ఔట్ఫిట్స్ తో వార్తల్లో నిలిచే దేవియాని శర్మ ఇప్పుడు తాజాగా స్విమ్ సూట్ తలపించేలా గ్రీన్ కలర్ డ్రెస్ లో కనిపించి తన అందాలతో మెస్మరైజ్ చేసింది.
రాళ్లపై చాలా ప్రత్యేకంగా ఫోజులు ఇచ్చిన ఈమె.. అందులో తన కాన్ఫిడెంట్ లెవెల్స్ ను మరింత పెంచుకుందనే చెప్పాలి. గ్లామర్ తో హీట్ పుట్టించడమే కాకుండా హుందాతనంగా స్పెషల్ ఫోజులు ఇచ్చిన తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం దేవియాని శర్మ షేర్ చేసిన ఈ అవుట్ ఫిట్ సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది..అసలే వేసవి మొదలవుతుంటే.. భగభగ మండే సూర్యుడు తాపానికి తట్టుకోలేకపోతుంటే.. మీరేమో ఇలా గ్లామర్ వలకబోస్తూ నెట్టింట హీట్ పుట్టిస్తున్నారు అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
దేవియాని శర్మ 1993 మే 30న న్యూఢిల్లీలో సునీల్ శర్మ , నీనా శర్మ దంపతులకు జన్మించింది. ఈమెకు సోదరి సోనం శర్మ ఉన్నారు. టీనేజ్ లోనే మోడలింగ్ వైపు వెళ్లిన ఈమె.. నటనపై ఆసక్తితో కొన్ని నాటకాలలో కూడా నటించింది.. 2020లో వచ్చిన రొమాంటిక్ ప్రేమ కథ చిత్రం భానుమతి అండ్ రామకృష్ణ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన దేవియాని.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది ..ఇక అటు జియో హాట్ స్టార్ లో రొమాంటిక్, సైతాన్ చిత్రాలతో పాటు సేవ్ ది టైగర్స్ వంటి సిరీస్ లతో విపరీతమైన పేరు కూడా సొంతం చేసుకుంది.
ఇకపోతే ఈమె మొదట తన సినిమా కెరియర్ ను హిందీ పరిశ్రమ నుండి ప్రారంభించడం గమనార్హం . లవ్ శుదా చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. ఇందులో చిన్న పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించింది.. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న దేవియాని ఇలా అందాలు ఆరబోస్తూ ఇంస్టాగ్రామ్ లో మంట రాజేస్తోంది.