పోయేవి పోయినా కొత్తవి మాత్రం ఆగట్లేదుగా!
సినీ ఇండస్ట్రీ ఒకప్పటిలా లేదు. ఒకప్పుడంటే నటీనటులు దర్శకనిర్మాతలను దృష్టిలో పెట్టుకుని కాల్షీట్స్, వర్కింగ్ అవర్స్, రెమ్యూనరేషన్ గురించి ఆలోచించేవారు కానీ ఇప్పుడలా కాదు.;
సినీ ఇండస్ట్రీ ఒకప్పటిలా లేదు. ఒకప్పుడంటే నటీనటులు దర్శకనిర్మాతలను దృష్టిలో పెట్టుకుని కాల్షీట్స్, వర్కింగ్ అవర్స్, రెమ్యూనరేషన్ గురించి ఆలోచించేవారు కానీ ఇప్పుడలా కాదు. పరిస్థితులు మారాయి. ఎవరేమనుకున్నా పర్లేదు తమ డిమాండ్స్ ను నెరవేరిస్తేనే సినిమాలు చేస్తాం లేకపోతే మా వల్ల కాదనేస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె ఒకరు.
వర్కింగ్ అవర్స్ కారణంగా అవకాశాలు కోల్పోయిన దీపిక
దీపిక తన డిమాండ్స్ వల్ల భారతదేశంలో తెరకెక్కనున్న రెండు భారీ బడ్జెట్ సినిమాల్లో అవకాశాన్ని కోల్పోయారు. అవే స్పిరిట్, కల్కి2. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందనున్న స్పిరిట్ మూవీపై అందరికీ ఎన్ని అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్పిరిట్ సినిమాలో ముందుగా ప్రభాస్ సరసన హీరోయిన్ గా దీపికానే అనుకున్నారు. కానీ వర్కింగ్ అవర్స్, రెమ్యూనరేషన్లు, తన టీమ్ కు జీతాలంటూ దీపికా పెట్టిన కండిషన్ల వల్ల మేకర్స్ స్పిరిట్ నుంచి దీపికాను తప్పించి త్రిప్తి డిమ్రీని హీరోయిన్ గా ఎంపిక చేశారు.
కల్కి2 నుంచి తప్పుకున్న దీపిక
ఇక మరో సినిమా ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ కల్కికి సీక్వెల్. కల్కి మూవీలో సుమతి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించిన దీపికా కల్కి2 కోసం తన రెమ్యూనరేషన్ తో పాటూ డిమాండ్లను కూడా భారీగా పెంచడంతో మేకర్స్ ఈ సినిమాను దీపికాను తప్పించి ఆ పాత్ర కోసం వేరే నటిని తీసుకోవాలని వెతుకుతున్నారు. అయితే ఈ రెండు భారీ సినిమాలు తన చేజారినా దీపికా ఎప్పుడూ వాటిపై పబ్లిక్ గా మాట్లాడింది లేదు.
దీపిక తన డిమాండ్లతో భారీ అవకాశాలన్నింటినీ ఇంతే చేజార్చుకుంటేదేమో అని అందరూ టెన్షన్ పడ్డారు కానీ అమ్మడి నుంచి ఆ రెండు సినిమాలు మిస్ అయినా మరో మూడు భారీ సినిమాలు తన చేతిలో ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీతో పాటూ షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న కింగ్ మూవీలోనూ దీపికానే హీరోయిన్. ఇవి కాకుండా విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ మహావతార్ లో దీపికా పరుశురాముడు భార్య ధరణి పాత్రలో మెరవనున్నారు. ఇవన్నీ చూసి దీపికా కు టాలెంట్ ఉంది కాబట్టే ఆమె ఎన్ని కండిషన్లు పెట్టినా ఆమెకు పాన్ ఇండియా అవకాశాలు క్యూ కడుతున్నాయని నెటిజన్లు భావిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.