• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్పీడ్ తగ్గించిన కుర్ర...

స్పీడ్ తగ్గించిన కుర్ర భామ!

| శ్రీలీల గత చిత్రాల విషయంలో వచ్చిన విమర్శలను సీరియస్‌గా తీసుకుని, తన ఇమేజ్‌కి తగ్గ పాత్రలను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-07-30 02:30 GMT

2019లో 'కిస్' అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయిన శ్రీలీల.. 'పెళ్లి సందD' చిత్రంతో టాలీవుడ్ లో సందడి చేసింది. తొలి సినిమాతోనే తన గ్లామర్ తో, డ్యాన్సులతో తెలుగు యువ హృదయాలను కొల్లగొట్టింది.. దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. దీంతో వరుస ఆఫర్లు తలుపు తట్టడంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సైన్ చేసింది. తీరిక లేకుండా షూటింగ్ లతో బిజీ అయిపోయింది. అయితే ఈ మధ్య కాలంలో అమ్మడు స్లో అండ్ స్టడీగా వెళ్తున్నట్లు అర్థమవుతోంది.

 

'ధమాకా' సినిమా హిట్టవ్వడంతో శ్రీలీలకు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. పెద్ద బ్యానర్లలో స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశం అందుకుంది. నెలకో సినిమా చొప్పున ప్రేక్షకులను పలకరించింది. అయితే స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం మూవీ హిట్టయినా ఈ బ్యూటీకి ఏమాత్రం పేరు తెచ్చిపెట్టలేదు. ఈ నేపథ్యంలో కుర్ర భామ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు కమిట్ అవుతున్నట్లు అనిపిస్తోంది.

 

శ్రీలీల ప్రస్తుతం నితిన్ కు జోడీగా 'రాబిన్‌హుడ్' అనే సినిమా చేస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గుంటూరు కారం తర్వాత ముద్దుగుమ్మ బిగ్ స్క్రీన్ మీద కనిపించే సినిమా ఇదే. అలానే రవితేజ హీరోగా నటిస్తున్న 'RT 75' మూవీలో మెయిన్ హీరోయిన్ గా ఎంపికైంది. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది.

 

వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ లో అడుగు పెట్టడానికి రెడీ అయింది శ్రీలీల. ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించనుంది. ఇవన్నీ కూడా ఆమె ముందే కమిటైన చిత్రాలు. కొత్తగా ఏ ప్రాజెక్ట్ కు కూడా సైన్ చేయలేదని తెలుస్తోంది. వచ్చిన ప్రతీ మూవీకి ఓకే చెప్పకుండా, ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

 

ఇటీవల శ్రీలీల ఒక బాలీవుడ్ చిత్రాన్ని, ఓ తమిళ సినిమాని రిజెక్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. 'సర్దార్ 2'లో కార్తీ పక్కన నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ, ఇద్దరు కథానాయికల్లో ఒకరిగా ఉండే సినిమా కావడంతో ఆ ఆఫర్ ను తిరస్కరించిందట. దీనికి కారణం ఆమె మెయిన్ హీరోయిన్ రోల్స్ లో నటించడానికే ఆసక్తి చూపిస్తోందని, ఇద్దరు హీరోయిన్లకు ప్రాధాన్యమున్న కథలను పక్కన పెడుతోందని అంటున్నారు.

 

శ్రీలీల గత చిత్రాల విషయంలో వచ్చిన విమర్శలను సీరియస్‌గా తీసుకుని, తన ఇమేజ్‌కి తగ్గ పాత్రలను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆమె తన చదువులను పూర్తి చెయ్యాలని నిర్ణయించుకుందట. మెడిసిన్ చేస్తూ సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు MBBS చదువుపై దృష్టి పెట్టడానికే కొత్త సినిమాలు కమిట్ అవ్వడం లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. ఏదేమైనా శ్రీలీలా మంచి మంచి సినిమాలతో రావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Tags:    
  • Sreeleela 
  • Talentedactress 
  • PellisandaD 
  • Dhamaka 
  • Robinhood 
  • Nithin 
  • Haijawanitoishqhonahai 
  • Bollywood 
  • Varundhawan 
  • Sardar2 
  • Karthi 
  • Ustadbhagatsingh 

Similar News

ర్యాపిడ్ ఫైర్ లో చైతూను ఇరికించేసిన సుమా.. ఏం క్లారిటీ గురూ!

2026-11-09 04:25 GMT

హీరోయిన్ అవ్వాలంటే.. అందమే ముఖ్యమా.. జాన్వీ..?

2026-11-09 04:25 GMT

వ‌రుస‌గా క్రేజీ సినిమాల‌తో రేసులో అగ్ర నిర్మాణ సంస్థ

2026-11-09 04:24 GMT

ప్రభాస్ ఈ సినిమాలకు సీక్వెల్స్ చేస్తే బాగుంటుందా?

2026-11-09 04:16 GMT

ఎడిట‌ర్ ఆవేద‌న‌: ఫంక్ష‌న్ల‌కు వెళ్లినా ప‌ట్టించుకోని శాఖ ఇది!

2026-11-09 03:40 GMT

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

Copyright @2026

Powered by Blink CMS