'కూలీ'.. TVలలో జనాలు చూశారా లేదా?
రీసెంట్ టైమ్‌లో చాలా మంది టాప్ స్టార్ హీరోల సినిమాలకు కూడా దాదాపు ఇదే రేంజ్ టీఆర్‌పీ వస్తోంది. దీన్నిబట్టి, టీవీ ఆడియెన్స్ ఈ స్టార్ల కాంబోను చూడటానికి మంచి ఇంట్రెస్ట్ చూపించారని అర్థమవుతోంది.;
సూపర్ స్టార్ రజినీకాంత్, కింగ్ నాగార్జున లాంటి ఇద్దరు లెజెండ్స్ కలిసి నటించిన 'కూలీ' సినిమాలో ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ లాంటి మరో ఇద్దరు స్టార్స్ స్పెషల్ పాత్రలలో మెప్పించడం అందరిలో ఒక స్పెషల్ ఎట్రాక్షన్ ను క్రియేట్ చేసింది, ఈ ఏడాది బిగ్గెస్ట్ హైప్ క్రియేట్ చేసిన ప్రాజెక్టులలో ఇది నెంబర్ వన్ లో ఉంటుంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా కంటెంట్ పరంగా అంచనాలను అందుకోలేకపోయింది. లోకేష్ కనగరాజ్ ట్రాక్ రికార్డ్ ని ఇది ఒక్కసారిగా బ్రేక్ చేసేసింది.
ఇక థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని, రీసెంట్‌గా టెలివిజన్ ప్రీమియర్‌కు వచ్చింది. జెమినీ టీవీలో ప్రసారమైన ఈ సినిమాకు ఫస్ట్ టెలికాస్ట్‌లో 6.16 టీఆర్‌పీ రేటింగ్ నమోదైంది. ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తున్న టైమ్‌లో, 6.16 రేటింగ్ అంటే అది ఖచ్చితంగా "మంచి రేటింగ్" కిందే లెక్క. కానీ ఒకప్పుడు రజినీకాంత్ సినిమా అంటే టెలివిజన్ ప్రీమియర్స్ కు సాలీడ్ రెస్పాన్స్ ఉండేది. కానీ ప్రస్తుత రోజుల్లో ఇది అంత బ్యాడ్ రికార్డ్ ఏమి కాదు.
రీసెంట్ టైమ్‌లో చాలా మంది టాప్ స్టార్ హీరోల సినిమాలకు కూడా దాదాపు ఇదే రేంజ్ టీఆర్‌పీ వస్తోంది. దీన్నిబట్టి, టీవీ ఆడియెన్స్ ఈ స్టార్ల కాంబోను చూడటానికి మంచి ఇంట్రెస్ట్ చూపించారని అర్థమవుతోంది. అయితే, 'కూలీ' సినిమాకు టీవీలో మంచి రెస్పాన్స్ వచ్చినా, థియేటర్లలో మాత్రం పరిస్థితి వేరు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 43.8 కోట్ల షేర్ రాబట్టి సాలిడ్‌గానే కనిపించినా, బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను మాత్రం అందుకోలేకపోయింది.
బయ్యర్లకు ఇది లాభాలు పంచలేదు. దీనికి ప్రధాన కారణం సినిమాకు వచ్చిన 'మిక్స్‌డ్ టాక్'. సినిమాపై ఉన్న హైప్‌కు, అంచనాలకు.. లోపల కంటెంట్ మ్యాచ్ కాలేదు. దీంతో, థియేటర్లకు రిపీట్ ఆడియెన్స్ రాలేదు. కానీ, రజినీ నాగ్ కాంబినేషన్ కావడంతో, ఇంట్లో ఫ్రీగా వస్తే ఒకసారి చూద్దాం అని ఆడియెన్స్ వెయిట్ చేశారు. ఆ క్యూరియాసిటీయే ఈ 6.16 టీఆర్‌పీ రేటింగ్‌కు కారణం అని చెప్పవచ్చు.
కంటెంట్ వీక్‌గా ఉన్నా, రజినీకాంత్ గ్లోబల్ స్టార్‌డమ్, నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్, ఆ క్రియేట్ అయిన హైప్.. అన్నీ కలిసి సినిమాను వరల్డ్ వైడ్‌గా గట్టెక్కించాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 519 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఇది 'క్లీన్ హిట్' కాకపోయినా, మిక్స్‌డ్ టాక్‌తో ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టడం మాత్రం గ్రేట్ అనే చెప్పాలి. ఓవరాల్‌గా 'కూలీ' జర్నీ ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ. తెలుగులో థియేటర్లలో బ్రేక్ ఈవెన్ అవ్వకపోయినా, వరల్డ్ వైడ్‌గా 500 కోట్లు దాటడం, డిజిటల్‌లో ఆకట్టుకోవడం విశేషం. ఇక ఇప్పుడు టెలివిజన్‌లో కూడా మంచి రేటింగ్ తెచ్చుకోవడం.. ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ను చూపిస్తోంది. జెమినీ టీవీ కూడా మంచి ప్రమోషన్స్ చేయడంతో, ఫ్యామిలీ ఆడియెన్స్ ఇంట్లో కూర్చుని ఈ స్టార్లపై ఓ లుక్కేశారని చెప్పవచ్చు.