నాన్న‌లు ఆర్మీలో...త‌న‌యులు తెర‌పైనా!

ఇండ‌స్ట్రీలో చాలా మంది సెల‌బ్రిటీలు ఆర్మీ, నేవీ , ఎయిర్ ఫోర్స్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబాల నుంచి వ‌చ్చిన వారే. దేశ సేవ‌లో తండ్రుల అంకిత‌మైతే? త‌న‌యులు ప్ర‌జ‌ల్ని అల‌రించ‌డంలో అంకిత‌మై ప‌ని చేస్తున్నారు.;

Update: 2025-08-15 22:30 GMT

ఇండ‌స్ట్రీలో చాలా మంది సెల‌బ్రిటీలు ఆర్మీ, నేవీ , ఎయిర్ ఫోర్స్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబాల నుంచి వ‌చ్చిన వారే. దేశ సేవ‌లో తండ్రుల అంకిత‌మైతే? త‌న‌యులు ప్ర‌జ‌ల్ని అల‌రించ‌డంలో అంకిత‌మై ప‌ని చేస్తున్నారు. ఇండ‌స్ట్రీకి రాక‌ముందు ర‌క‌ర‌కాల ప్రాంతాల‌ను...అక్క‌డ క‌ల్చ‌ర్ ను తెలుసుకున్న సెల‌బ్రిటీలు చాలా మంది ఉన్నారు. నేడు స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా డిఫెన్స్ కుటుంబాల నుంచి వ‌చ్చిన సెల‌బ్రిటీల గురించి ఓ సారి తెలుసుకుంటే స‌రి.

ర‌కుల్ ప్రీత్ సింగ్ తండ్రి రాజేంద్ర సింగ్ ఓ ఆర్మీ అధికారిగా దేశానికి సేవ‌లందిస్తున్నారు. డాడ్ అంటే ర‌కుల్ కి చాలా భ‌యం అని ప‌లు సంద‌ర్భాల్లో చెప్పింది. కిలాడీ అక్ష‌య్ కుమార్ తండ్రి హ‌రి ఓం భాటియా. ఇత‌ను ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు. అక్ష‌య్ కి చిన్న వ‌య‌సు నుంచే క్ర‌మ శిక్ష‌ణ అల‌వాటు అయిందంటే కార‌ణం డాడ్. ఇప్ప‌టికీ అదే ఫిజిక్ మెయింటెన్ చేస్తున్నాడంటే బాల్యం లో ప‌డిన బీజం గానే చెబుతారు. అలాగే మ‌రో బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ తండ్రి కూడా ఆర్మీనే. ఆయ‌న పేరు క‌ల్న‌ల్ అజ‌య్ కుమార్. కార్గిల్ యుద్దంలో పాల్గొన్నారు.

అనుష్క స్కూలింగ్ అంతా బెంగుళూరు ఆర్మీ స్కూల్లోనే జ‌రిగింది. అలాగే గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తండ్రి కూడా ఆర్మీలో వైద్యులుగా ప‌ని చేసారు. డాడ్ గురించి పీసీ ఎంతో గొప్ప‌గా చెబుతుంది. లారా ద‌త్తా తండ్రి ఎల్ కె. ద‌త్తా ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ లో వింగ్ క‌మాండర్ గా ప‌నిచేసి రిటైర్ అయ్యారు. మాజీ విశ్వ సుంద‌రి సుస్మితా సేన్ తండ్రి శుభీర్ సేన్ కూడా విశ్రాంత వింగ్ క‌మాండ‌ర్ గా ప‌ని చేసారు. నిమ్ర‌త్ కౌర్ తండ్రి మ‌జోర్ భూపీచందర్ ఆర్మీలో పని చేసి ఉగ్ర‌దాడిలో వీర‌మ‌ర‌ణం పొందారు.

ప్రీతీ జింటా, శ్ర‌ద్దా శ్రీనాద్ తండ్రులు కూడా డిపెన్స్ లో ప‌నిచేసారు. గాయ‌త్రి గుప్తా తాత‌య్య ఆర్మీలో ప‌నిచేసారు. నేహా దూపియా తండ్రి ప్ర‌దీప్ సింగ్ ఇండియ‌న్ నేవీలో ప‌ని చేసారు. నాగ‌చైత‌న్య స‌తీమ‌ణి శోభిత ధూళిపాళ తండ్రి కూడా నేవీలోనే రిటైర్ అయ్యారు. ఇలా సెల‌బ్రిటీ కుటుంబాల్లో తండ్రులు చాలా మంది దేశ ర‌క్ష‌ణ‌లో భాగ‌మ‌య్యారు.

Tags:    

Similar News