వైరల్ వీడియో : సింహంతో ఆట చివరికి...!
సింహాన్ని దాని డెన్ లోకి వెళ్లి చూడాలనుకున్న ఒక యువకుడు చివరికి ప్రాణాలు కోల్పోయాడు. అందరూ చూస్తుండగానే సింహానికి అతడు ఆహారంగా మారిపోయాడు.;
సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొందరు ఆకతాయిలు జంతువులతో ఆడుకోవడం, వాటిని ఇబ్బంది పెట్టడం చూస్తూ ఉంటాం. కొన్ని జంతువులు ఆకతాయిలు ఇబ్బంది పెడుతుంటే అక్కడి నుండి వెళ్లిపోతాయి, కొన్ని జంతువులు మాత్రం ఆకతాయిలపై ప్రతిఘటించడం మనం చూస్తూ ఉంటాం. ఇతర జంతువుల సంగతి పక్కన పెడితే పులులు, సింహాలు వంటి క్రూర మృగాలతో ఆడుకోవడం.. వాటిని దగ్గర నుండి చూడాలని కోవడం, వాటిని ఇరిటేట్ చేయాలి అనుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదని మరోసారి నిరూపితం అయ్యింది. సింహాన్ని దాని డెన్ లోకి వెళ్లి చూడాలనుకున్న ఒక యువకుడు చివరికి ప్రాణాలు కోల్పోయాడు. అందరూ చూస్తుండగానే సింహానికి అతడు ఆహారంగా మారిపోయాడు. జూ సిబ్బంది స్పందించడంలో కాస్త ఆలస్యం కావడంతో అతడి ప్రాణం క్షణాల్లో గాలిలో కలిసింది. అతడి అత్యుత్సాహం అతడి ప్రాణాలను తీసిందని సోషల్ మీడియాలో చాలామంది ఈ వీడియోని షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
బ్రెజిల్ జూలో సంఘటన
సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే బ్రెజిల్ లోని ఒక జూలో ఈ ఘటన జరిగింది. పూర్తిగా క్లోజ్ అయ్యి ఉన్న ఒక డెన్ లో సింహం బంధింపబడి ఉంది. దాన్ని చూసేందుకు ప్రతి రోజు వందలాది మంది సందర్శకులు వెళ్తూ ఉంటారు. అత్యంత దృఢమైన గాజు గ్లాస్ కి యువతల వైపు జనాలు ఉండి సింహాన్ని చూస్తూ దాన్ని కవ్విస్తూ ఉంటారు. ఎంతోమంది దాన్ని కవ్వించినా కూడా దృఢమైన గ్లాసు ఉన్న కారణంగా బయటికి వచ్చే అవకాశం లేదు. కానీ ఎప్పుడైతే ఎవరైనా లోనికి వెళ్తారో వారిని ఆ సింహం విడిచిపెట్టదు. క్షణాల్లోనే ప్రాణాలు తీసి భోజనం చేసినట్లుగా శరీరం మొత్తాన్ని తినేస్తుంది. ఇదే ఆరోజు అక్కడ జరిగింది. ఆకతాయి యువకుడు చేసిన పని కారణంగా వందల మంది చూస్తుండగానే సింహం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.
సింహం బోనులోకి వెళ్లి..
ఈ దుర్ఘటనలో సింహం తప్పు అస్సలు లేదని, అతడు కావాలని డెన్ డెన్ లోకి వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. గోడ పక్కన ఉన్న ఒక చెట్టు సహాయంతో సింహాన్ని దగ్గరగా చూడాలని భావించిన ఆ యువకుడు ఎక్కాడు, పట్టు కోల్పోయి కిందపడ్డాడు. దాంతో సింహం అతడిని అతడి పై దాడి చేసింది. తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ సింహం ముందు చేతులెత్తేశాడు. సింహం నిమిషంలోపే అతడిని ప్రాణాలు లేకుండా చేసిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇలాంటి వీడియోలు గతంలో సోషల్ మీడియాలో ఎన్నో వచ్చాయి అయినా కూడా కొందరు ఆకతాయిలు ఇలాంటి పనులు ఎప్పటికప్పుడు చేస్తూ ప్రాణాల మీదికి తీసుకొస్తున్నారు. జూ సిబ్బంది ఎంతగా కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏదో ఒక దారి గుండా సింహం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించే వాళ్ళు ఉంటున్నారు. అలా ప్రయత్నించి సింహం వద్దకు వెళ్లి చనిపోయేవారు ఎక్కువ అవుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్..
ఎక్కడో దూరంగా ఉన్న సింహం వ్యక్తి చెట్టు ఎక్కి తన డెన్ లోకి అడుగు పెట్టాడు అని గుర్తించి వెంటనే వెళ్లి అతడిని తన భోజనంగా మార్చేసుకుందంటే దానిని దృష్టి ఎంత షార్ప్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి క్రూర మృగాలను దూరంగా కూడా చూడడం మంచిది కాదు, అలాంటివి దగ్గరికి వెళ్లి దాని డెన్లోకి వెళ్లి చూడాలి అనుకోవడం కచ్చితంగా చెత్త తప్పుడు నిర్ణయం. అందుకు తగ్గట్లు అతడు తగిన శాస్తిని పొందాడు అంటూ సోషల్ మీడియాలో కొందరు అతని తీరుపై విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో సున్నిత మనస్కులకు బాధను కలిగిస్తుంటే, కొందరు మాత్రం అతడి ఆకతాయి తనానికి ఇలా జరగాల్సిందే అంటూ కామెంట్ చేస్తున్నారు. సింహం తన బోనులోకి ఎవరైనా వస్తే చూస్తూ ఊరుకోదు అనే విషయం అందరికీ తెలుసు, అయినా కూడా తానే బోనులోకి వెళ్లాలి అనుకోవడం పెద్ద తప్పు. ఆ తప్పు చేసినప్పుడు ఎంతటి వారికైనా శిక్ష తప్పదు అనేది ఈ వీడియో సారాంశం అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు.