క్యాంపస్ రోమాన్స్ కు సరిగ్గా సరిపోయే నవతరం తారలు!
కాలేజీ రోజుల్లోని అల్లరి, ప్రేమ, స్నేహం వంటి అంశాలు యువ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
కాలేజీ బ్యాక్‌డ్రాప్ -క్యాంపస్ రోమాన్స్ కథాంశాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. కాలేజీ రోజుల్లోని అల్లరి, ప్రేమ, స్నేహం వంటి అంశాలు యువ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బాలీవుడ్‌లో సరికొత్త గ్లామర్..ఎనర్జీని తీసుకొస్తూ క్యాంపస్ లవ్ స్టోరీలకు పక్కాగా సరిపోతారని విమర్శకులు- ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న ఏడుగురు యువ నటుల గురించి పరిశ్రమ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ నవతరం నటుల జాబితాలో అగస్త్య నందా ,వేదాంగ్ రైనా ముందంజలో ఉన్నారు.
'ది ఆర్చీస్' చిత్రంతో వెండితెరకు పరిచయమైన జోడీ చాక్లెట్ బాయ్ లుక్స్‌తో , నటనతో తొలి చిత్రంతోనే క్యాంపస్ వైబ్స్‌ను అద్భుతంగా పండించగలరని నిరూపించారు. ముఖ్యంగా లవర్ బాయ్ పాత్రలలోనూ, కాలేజీ విద్యార్థిగా ఉండే చార్మింగ్‌ను ప్రతిబింబించడంలోనూ ఇద్దరి శైలి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రాబోయే రోజుల్లో మరిన్ని రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారే అవకాశం లేకపోలేదు. వీరితో పాటు ఇబ్రహీం అలీ ఖాన్, జునైద్ ఖాన్ వంటి స్టార్ కిడ్స్ కూడా రేసులో దూసుకుపోతున్నారు.
తమకంటూ ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న యువ నటులు, క్లాసిక్ లవ్ స్టోరీలకు , ఆధునిక కాలేజీ డ్రామాలకు సరిగ్గా సరిపోతారని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. నేటి తరం యువత ఆలోచనలను, వారి ప్రేమ భావాలను తెరపై ప్రతిబింబించడానికి అవసరమైన లుక్స్ , బాడీ లాంగ్వేజ్ వీరిలో పుష్కలంగా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరికొందరు ప్రతిభావంతులైన యువ నటులు కూడా విభిన్నమైన లుక్స్‌తో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. సాంప్రదాయ లవ్ స్టోరీలు మాత్రమే కాకుండా క్యాంపస్ నేపథ్యంలో సాగే కాంప్లెక్స్ రిలేషన్‌షిప్స్, ఎమోషనల్ డ్రామాలను సైతం పండించగల సత్తా తమకు ఉందని నిరూపిస్తున్నారు.
బాలీవుడ్‌లో చాలా కాలంగా మంచి ప్యూర్ క్యాంపస్ రోమాన్స్ సినిమా రాలేదనే లోటును తీర్చడానికి ఈ తరం తారలు సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. గతంలో రిషి కపూర్, షారూఖ్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ వంటి స్టార్ హీరోలు క్యాంపస్ , లవర్ బాయ్ పాత్రలతోనే లార్జర్ దన్ లైఫ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుత తరం నటులు కూడా అదే బాటలో పయనిస్తూ యూత్‌కు కనెక్ట్ అయ్యే కథలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా ఓటీటీ , థియేటర్లలో యువతను ఆకట్టుకునేందుకు లవ్ స్టోరీలు అత్యుత్తమ మాధ్యమంగా మారుతున్నాయి.
మొత్తంగా బాలీవుడ్ నవతరం హీరోలు సరికొత్త కథలతో చిత్ర పరిశ్రమలో నూతన అధ్యాయాన్ని సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. మేకర్స్ కూడా ఈ ఏడుగురు నటుల చార్మింగ్ లుక్స్‌ను వినియోగించుకుంటూ భారీ క్యాంపస్ ఎంటర్‌టైనర్లను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి రాబోయే కాలంలో ఈ యువ తారలలో ఎవరు కాలేజీ లవ్ స్టోరీలతో బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తారో ? తదుపరి జనరేషన్ రొమాంటిక్ స్టార్స్ గా ఎవరు అవతరిస్తారో చూడాలి.