బిగ్ బాస్ 9.. రాంగ్ సెలక్షన్ తప్పు ఎవరిది..?

ప్రతి సీజన్ మొదలైనప్పుడే కానీ ప్రత్యేకంగా ఈ సీజన్ ని మాత్రం కామనర్స్ ని ఎంపిక చేసే విధానం కోసం బిగ్ బాస్ అగ్నిపరీక్ష అంటూ ఒకటి నడిపించారు.;

Update: 2025-09-15 04:50 GMT

బిగ్ బాస్ సీజన్ 9 ఎంతో హంగామాగా మొదలైంది. ప్రతి సీజన్ మొదలైనప్పుడే కానీ ప్రత్యేకంగా ఈ సీజన్ ని మాత్రం కామనర్స్ ని ఎంపిక చేసే విధానం కోసం బిగ్ బాస్ అగ్నిపరీక్ష అంటూ ఒకటి నడిపించారు. అందులో నుంచి 13 మందిని ఫైనల్ చేసి వారిలో నుంచి ఆడియన్స్ ఓటింగ్ తో ముగ్గురిని.. జడ్జిల ఎంపికతో మరో ముగ్గురిని హౌస్ లోకి పంపించారు. కామనర్స్ గా వెళ్లిన వీళ్లు బిగ్ బాస్ సీజన్ 9 లో ఓనర్స్ గా ఉన్నారు.

ఓనర్స్ వర్సెస్ టెనంట్స్ టాస్కులు..

ఇక సెలబ్రిటీస్ గా వెళ్లిన కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ 9 లో టెనంట్స్ గా ఉంటున్నారు. ఓనర్స్ వర్సెస్ టెనంట్స్ టాస్కులు జరుగుతున్నాయి. ఐతే బిగ్ బాస్ సీజన్ 9 మొద్దలైన వారం రోజుల్లోనే బాబోయ్ అనిపించేసింది. ఆడియన్స్ అయితే కామర్స్ చేస్తున్న అతిని తట్టుకోలేకపోతున్నారు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా వచ్చిన కామనర్స్ ని ఓనర్స్ చేస్తే వాళ్లు నిజంగానే ఓనర్స్ లా ఫీలై వాళ్ల సాడిజం చూపిస్తున్నారు. హోస్ట్ నాగార్జుననే ఈ విషయాన్ని చెప్పారు.

అంతేకాదు కామనర్స్ లో కొందరు అసలు బిగ్ బాస్ సెటప్ కి అర్హులు కారని అనేస్తున్నారు. ముఖ్యంగా మాస్క్ మ్యాన్ గా వచ్చిన హరీష్ తనకి ఎవరు ఏం చెప్పినా సరే వినే పరిస్థితి కనిపించట్లేదు. శనివారం ఎపిసోడ్ లో నాగార్జుననే మీరంతా సెట్ చేస్తున్నారంటూ చెప్పడంతో నాగ్ కూడా ఫైర్ అయ్యాడు. ఇక మనీష్, ప్రియ, శ్రీజలో అగ్నిపరీక్ష టైం లో ఉన్న ఫైర్ లేదు. డీమాన్ పవన్, కళ్యాణ్ పడాల కూడా ఏదో జస్ట్ అలా ఉన్నారంటే ఉన్నారు.

హౌస్ లో వాళ్లు డిజర్వ్ కాదనేలా..

బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోకి జడ్జులుగా ఉన్న అభిజిత్, నవదీప్, బిందు మాధవి హోస్ట్ శ్రీముఖి ఈ ఆరుగురిని ఎంపిక చేశారు. కచ్చితంగా హౌస్ లో వీళ్ల ఆట బాగుంటుందని భావించే వాళ్లు ఛాన్స్ ఇచ్చారు. కానీ వాళ్లు మాత్రం అసలు డిజర్వ్ కాదనేలా ప్రవర్తిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 లో కామనర్స్ పరిస్థితి ఇలా ఉంటే.. సెలబ్రిటీస్ లో కూడా ఒక్కరు కరెక్ట్ పర్సన్ అనిపించట్లేదు.

సీరియల్ బ్యాచ్ గా తనూజ, భరణిని తీసుకొచ్చారు. రీతు చౌదరి, ఇమ్మాన్యుయెల్ స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీస్ కాబట్టి వాళ్లను తీసుకున్నారు. రాము రాథోడ్, సుమన్ శెట్టి వచ్చారు కానీ ఆశించిన పర్ఫార్మెన్స్ లేదు. సంజన ఎప్పుడు ఏదో ఒకటి అరుస్తూనే ఉంటుంది. ఫ్లోరా షైనీ అసలు హౌస్ లోకి ఎందుకు వచ్చిందో తెలియదు. ఇలా సెలబ్రిటీస్ లో కూడా కంటెంట్ ఇస్తున్న వాళ్లు చాలా తక్కువ అనిపిస్తుంది.

వీళ్లతో మొదటి వారమే చిరాకు రాగా మరో 100 రోజులు ఆట ఎలా కొనసాగిస్తారన్నది చూడాలి. ఆడియన్స్ అయితే అసలే బిగ్ బాస్ అంటే చిన్నపాట్ అసంతృప్తి ఉండగా కాస్త కూస్తో ఉన్న ఇంట్రెస్ట్ ని కూడా పోయేలా చేస్తున్నారు.

Tags:    

Similar News