అంతగా వాళ్లను ఏం మాయ చేశావయ్యా 'డియర్‌ కామ్రేడ్‌'

Update: 2020-08-29 03:30 GMT
విజయ్‌ దేవరకొండ.. రష్మిక మందన్నా జంటగా వచ్చిన గీత గోవిందం సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అవ్వడంతో వారి కాంబోలో వచ్చిన 'డియర్‌ కామ్రేడ్‌' పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. కాని కామ్రేడ్‌ ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యాడు. తెలుగుతో పాటు సౌత్‌ లో అన్ని భాషల్లో కూడా విడుదల అయిన డియర్‌ కామ్రేడ్‌ సినిమాకు ఎక్కడ కూడా ఆధరణ దక్కలేదు. ఈ సినిమాను హిందీలో కరణ్‌ జోహార్‌ రీమేక్‌ చేయాలని విడుదలకు ముందే అనుకున్నాడు. అయితే తెలుగులో ఫలితం తేడా కొట్టడంతో రీమేక్‌ ప్రయత్నాలు మానుకున్నాడు. అన్ని సినిమాల మాదిరిగానే డియర్‌ కామ్రేడ్‌ సినిమాను కూడా హిందీలో డబ్‌ చేసి యూట్యూబ్‌ ద్వారా ఉత్తరాది ప్రేక్షకుల వద్దకు తీసుకు వెళ్లారు.

బాహుబలి సినిమా ప్రభావమో లేక మరేంటో కాని ఈమద్య యూట్యూబ్‌ లో విడుదల అవుతున్న హిందీ డబ్ తెలుగు సినిమాలు చాలా వరకు రికార్డు స్థాయి వ్యూస్‌ ను దక్కించుకుంటున్నాయి. బాలీవుడ్‌ సినిమాలకు కూడా రాని యూట్యూబ్‌ వ్యూస్‌ మన తెలుగు సినిమాలు కొన్ని సాధించాయి. దాదాపు ఏడు నెలల క్రితం హిందీలో విడుదల అయిన 'డియర్‌ కామ్రేడ్‌' సినిమా అక్కడ మంచి టాక్‌ ను సొంతం చేసుకుంది. యూట్యూబ్‌ లో ఈ సినిమా ఇప్పటి వరకు 160 మిలియన్‌ ల వ్యూస్‌ వచ్చాయి.

ఈ స్థాయి వ్యూస్‌ పెద్ద విషయం కాదు. కాని ఈ సినిమాకు ఏకంగా రెండు మిలియన్‌ ల లైక్స్‌ వచ్చాయి. ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ మూవీకి ఈ స్థాయి యూట్యూబ్‌ వ్యూస్‌ వచ్చిన దాఖలాలు లేవు. ఇక్కడ ఫ్లాప్‌ అయిన కామ్రేడ్‌ లో వారికి అంతగా ఏం నచ్చిందో మరి. కామ్రేడ్‌ లిల్లీలు వారిని అంతగా ఏం మెస్మరైజ్‌ చేశారో. కమర్షియల్‌ గా నిరాశ పర్చిన కామ్రేడ్‌ కు ఇలాంటి గౌరవాలు చాలానే దక్కాయి. ఇప్పుడు మోస్ట్‌ లైక్డ్‌ మూవీగా నెం.1 స్థానంలో నిలిచింది.
Tags:    

Similar News