ముంబై పార్టీల్లో రౌడీ హల్చల్ అతడి ఫేవరెట్ తో కలిసి!
ముంబై క్రౌడ్ కి పార్టీలు ఫంక్షన్లు అంటే ఏ రేంజు జోష్ వచ్చేస్తుందో చెప్పాల్సిన పనే లేదు. అయితే సెకండ్ వేవ్ ప్రభావం తో ఈమధ్య ఈ తరహా వేడుకలకు ఆస్కారం లేకుండా పోయింది. ఇటీవల కరోనా కేసులు తగ్గడంతో ముంబై మహారాష్ట్ర ఫ్రీ అయిపోయాయి. దీంతో తిరిగి బాలీవుడ్ లో షూటింగులతో పాటు పార్టీలు ఫంక్షన్ల హడావుడి కూడా పెరిగింది.
నేడు బాలీవుడ్ యువహీరో అర్జున్ కపూర్ బర్త్ డే పార్టీలో సెలబ్రిటీ జోష్ ప్రముఖంగా చర్చకు వచ్చింది. అర్జున్ బాలీవుడ్ స్నేహితులు అందరూ శుక్రవారం రాత్రి తన పుట్టినరోజు పార్టీకి హాజరయ్యారు. కపూర్ బోయ్ తన 36 వ పుట్టినరోజును ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ లో జరుపుకున్నారు.
ఈ పార్టీకి హాజరైన వారిలో ఆలియా భట్ - రణబీర్ కపూర్ జంటతో పాటు.. సోదరీమణులు జాన్వి కపూర్ - ఖుషి కపూర్ -అన్షులా కపూర్ ఉన్నారు. వీళ్లతో పాటే డాన్ కరణ్ జోహార్ కూడా దిగిపోయారు. ఇక ఈ పార్టీలో ప్రత్యేక ఆకర్షణ ఎవరు? అంటే ది గ్రేట్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్.. ఇక ఇదే పార్టీలో ఔట్ సైడర్ స్టార్ ఎవరు? అంటే.. విజయ్ దేవరకొండ. టాలీవుడ్ నుంచి హాజరైన ఏకైక స్టార్ అతడే. దీంతో ఇద్దరు ఎనర్జిటిక్ స్టైలిష్ స్టార్లు రణవీర్ - దేవరకొండ ఫోటోలను వైరల్ గా షేర్ చేస్తున్నారు అభిమానులు.
ఇటీవల లైగర్ షూటింగ్ కోసం ముంబైలో ఉంటున్న రౌడీ బోయ్ తన బ్రాండ్ వ్యాల్యూని అంతకంతకు విస్తరిస్తున్నాడు. ఇంతకుముందు కూడా కరణ్ జోహార్ ఏర్పాటు చేసిన ఓ పార్టీలో రణవీర్ తో కలిసి దేవరకొండ సెల్ఫీ దిగాడు. ఆ సెల్ఫీ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. మరోసారి పార్టీ పేరుతో ఆ ఇద్దరూ కలవడం ఆసక్తికరం. భవిష్యత్ లో ఇద్దరు స్టైలిష్ ఫ్యాషనిస్టాలు కలిసి ఓ సినిమాలో నటిస్తారేమో చూడాలి. అందుకు కరణ్ జోహార్ ఏదైనా ప్లాన్ చేస్తారా అన్నది చూడాలి. విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ `లైగర్` ప్రమోషన్స్ తో బాలీవుడ్ క్రౌడ్ లోనూ పాపులారిటీ పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. కియరా.. జాన్వీ లాంటి భామలు అతడితో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు.