కూతురు కోసం రెండో కహానీ??

Update: 2016-10-24 17:30 GMT
దక్షిణాది సినిమాల్లో మచ్చుకైనా లేని ఓ అలవాటును.. బాలీవుడ్ జనాలు మాత్రం స్ట్రిక్టుగా పాటించేస్తుంటారు. ఎప్పుడూ అవే సినిమాలు.. అవే సీన్లతో సినిమాలు తీస్తున్నా.. ఎప్పటికప్పుడు ప్రతీ సినిమాతో అదేదో భూమి బద్దలైపోయే స్టోరీ పట్టుకొచ్చేస్తున్నాం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చి.. చివరకు ఉసూరుమనిపించడం సౌత్ లో బాగా కనిపించే ఓ హ్యాబిట్. కానీ బాలీవుడ్ లో మాత్రం మనం ఏం చూడబోతున్నామో ముందే చెప్పేసి మరీ థియేటర్లకు పిలుస్తూ ఉంటారు. అయినా సక్సెస్ సాధించగలగడం వీరి స్పెషాలిటీ.

కహానీ2.. దుర్గారాణి సింగ్ అంటూ బాలీవుడ్ భామ విద్యాబాలన్.. త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది. కహానీ చిత్రంలో భర్త కోసం వెతుక్కుంటూ కష్టాలుపడే గర్భవతి రోల్ ని పర్ఫెక్ట్ గా చూపించేసి భారీ హిట్ కొట్టిన విద్య.. ఆ సారి కూతురు కోసం కష్టాలు పడబోతున్నట్లుగా ఉంది. హత్య.. కిడ్నాప్‌ లు చేసినందుకు గాను వాంటెడ్ అనే పోస్టర్ పడగా.. రీసెంట్ గా విడుదల చేసిన ఓ పోస్టర్ ఆకట్టుకుంటుంది.

షుమార్ ఓ పదేళ్ల బాలికను ఎత్తుకుని నవ్వుతూ నడిచొస్తున్న విద్యాబాలన్ ఆ పోస్టర్ లో కనిపిస్తుంది. ఇప్పటివరకూ ఇచ్చిన పోస్టర్లలో భయం తప్ప నవ్వు చిందించని విద్య.. ఈ పోస్టర్ లో మాత్రం మనసారా నవ్వుతోంది. ఇది క్లైమాక్స్ తర్వాత శుభం కార్డుకు ముందు వచ్చే సీన్ లా అనిపిస్తోంది. కథ సుఖాంతం అని చెప్పి మరీ థియేటర్లకి పిలుస్తున్నారంటే.. కహానీ మేకర్స్ గట్స్ ని పొగడాల్సిందే. డిసెంబర్ 2న కహానీ2 రిలీజ్ కానుంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News