డర్టీ యాక్టింగ్ చేసేవా బేగమ్ జాన్

Update: 2017-03-07 05:45 GMT
డర్టీ పిక్చర్ లో తనదైన డర్టీ యాక్టింగ్ తో విద్యా బాలన్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. సిల్క్ స్మిత జీవిత చరిత్రను సినిమాటిక్ గా ఓ రేంజ్ లో చూపించేశారు. ఆ తర్వాత ఈ భామ రేంజ్ మరో నాలుగు మెట్లు ఎక్కేసింది. ఇప్పుడు మరోసారి బేగమ్ జాన్ మూవీలో ఆ స్థాయి కలరింగ్ ఇచ్చేస్తోంది విద్యాబాలన్.

బేగమ్ జాన్ లో ఒక వేశ్యాగృహ నిర్వాహకురాలిగా విద్యాబాలన్ కనిపించనుంది. ఇప్పుడీమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. కాసింత ఒళ్లు చేసిన దేహంతో.. 3/4 హ్యాండ్స్ వేసుకున్న టాప్.. మెరూన్ కలర్ లెహంగా వేసుకుని ఓరగా చూస్తున్న విద్య మనకు ఈ పోస్టర్ లో దర్శనం ఇస్తుంది. చేతిలో హుక్కా పట్టుకుని.. మరో పక్కన గన్ దగ్గర పెట్టుకున్న అమ్మడి లుక్ చూస్తుంటే.. నిజంగా వేశ్యా గృహాన్ని నడిపే మహిళ ఇలానే ఉంటుందేమో అనిపించేయడం ఖాయం.

'నా శరీరం.. నా ఇల్లు. నా దేశం.. నా రూల్స్' అంటూ తగిలించిన కేప్షన్ మరింతగా ఆకట్టుకోవడం ఖాయం. 'స్వాతత్ర్యంతో స్వేచ్ఛ యుద్ధం చేసినపుడు' అనే ట్యాగ్ లైన్ మరింతగా ఎట్రాక్ట్ చేస్తుంది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో.. ముకేష్ భట్-విశేష్ భట్ లు నిర్మించిన బేగమ్ జాన్ చిత్రాన్ని.. ఏప్రిల్ 14న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది యూనిట్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News