మేకింగ్ అదరగొడుతున్న రజినీ డాటర్

Update: 2017-06-23 05:39 GMT
సౌందర్య రజినీ కాంత్ డైరెక్షన్ అంటే బహుశా కొంతమంది ఉలిక్కిపడతారేమో కూడా. రజినీకాంత్.. దీపికా పదుకొనేలతో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ.. కొత్త తరం మూవీ అంటూ.. డీటీపీ సెంటర్ కంటే నాసిరకం గ్రాఫిక్స్ తో 'కొచ్చాడయాన్' మూవీ తీసింది రజినీ డాటర్ సౌందర్య. మళ్లీ ఇన్నేళ్ల వరకూ డైరెక్షన్ మాటెత్తలేదు కానీ.. ఇప్పుడు తమ ఇంటి అల్లుడు అయిన ధనుష్ హీరోగా ఓ సినిమాను డైరెక్ట్ చేసేస్తోంది సౌందర్య.

వేలఇళ్ల పట్టాదారి(వీఐపీ)కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం కావడంతో వీఐపీ2 పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కాజోల్ ను కీలకమైన పాత్రలోకి తీసుకున్నారు. ఇప్పుడీ మూవీకి సంబంధించిన తొలి మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. కాజోల్ మహా స్టైలిష్ గా కనిపిస్తుంటే.. ఇంజినీర్ అయిన తమిళ కుర్రాడిగా తన పాత లుక్స్ నే కొంచెం కొత్తగా చూపించాడు ధనుష్. అయితే.. తమిళ సినిమాల్లో కనిపించే మాదిరి కాసింత ఓవర్ యాక్షన్.. హై ఓల్టేజ్ ఫైట్ సీక్వెన్స్ లను కూడా బాగానే దట్టించినట్లుగా కనిపిస్తోంది.

ధనుష్ కి జోడీగా అమలాపాల్ నటిస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉండడానికి అసలైన కారణం.. స్టోరీ-డైలాగ్స్ ను ధనుష్ అందించడమే అని చెప్పచ్చు. ఈ హీరోనే తన స్వీయ నిర్మాణంలో రూపొందిస్తుండడంతో.. సౌందర్యా రజినీకాంత్ మాదిరి ప్రయోగాలకు ఇక్కడ ఛాన్స్ ఉండకపోవచ్చు. వీఐపీ తెలుగులో రఘువరన్ బీటెక్ గా వచ్చి ఇక్కడి ప్రేక్షకులను మెప్పించగా.. వీఐపీ2 కూడా అదే ఫీట్ ను రిపీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News