#నిహారిక వెడ్డింగ్.. వైష్ణ‌వ్ తేజ్ అల్ట్రా స్మార్ట్ లుక్

Update: 2020-12-08 11:30 GMT
కుంద‌న‌పు బొమ్మ నిహారిక పెళ్లి ఈ బుధ‌వారం సాయంత్రం రాజ‌స్థాన్ ఉద‌య్ పూర్ లోని ఉద‌య్ ప్యాలెస్ లో వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. గుంటూరు ఐజీ కుమారుడు చైత‌న్య‌ను మెగా ప్రిన్సెస్ పెళ్లాడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ పెళ్లి వేడుక‌కు బంధుమిత్రులు కుటుంబ స‌భ్యులు ఎటెండవ్వ‌గా ఇప్ప‌టికే మెగా హీరోల ఫోటోల‌న్నీ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

ఇక ఈ పెళ్లిలో మ‌రో యువహీరో ఫోటో షూట్ సంచ‌ల‌నంగా మారింది. సుప్రీంహీరో సాయితేజ్ సోద‌రుడు `ఉప్పెన` ఫేం వైష్ణ‌వ్ తేజ్ అల్ట్రా స్మార్ట్ లుక్ లో క‌నిపించి స‌ర్ ప్రైజ్ చేశాడు. బ్లూ అటైర్ లుక్ లో డ్యాషింగ్ స్టైల్లో క‌నిపించాడు.

నిజానికి ఉప్పెన చిత్రంలో అత‌డు పూర్తి మాస్ అవ‌తార్ లో క‌‌నిపించ‌బోతున్నాడు. బెస్త‌వానిగా పూర్ గ‌య్ పాత్ర‌లో న‌టిస్తున్నా‌డు. ఆ మూవీ స్టిల్స్ లో గెట‌ప్ కి ఇప్పుడు రివీలైన గెట‌ప్ కి ఏమాత్రం సంబంధం లేదు. త‌న సోద‌రుడు సాయి తేజ్ లానే వైష్ణవ్ కూడా క్లాస్ మాస్ లుక్ తో అభిమానుల్లోకి దూసుకెళ్ల‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.
Tags:    

Similar News