#సరిలేరు.. ట్విట్టర్ లో రికార్డుల బ్రేకింగ్
ఈ సంవత్సరం మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో కోవిడ్ -19 సంబంధించిన వార్తలు టాప్ ట్రెండింగ్ లో నిలిచాయి. మహమ్మారి సంగతి వదిలేస్తే 2020లో టాప్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ లతో ట్వీట్ లను వెల్లడించగా అందులో `సరిలేరు నీకెవ్వరు` స్థానం ఆశ్చర్యపరిచింది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ గురించి నెటిజనులు విస్త్రతంగా సెర్చ్ చేశారట. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ `సరిలేరు నీకెవ్వరు` టాప్ 3లో నిలిచింది. భారతీయ సినిమాల్లో తెలుగు సినిమా కేటగిరీలో ఈ మూవీ టాప్ లో నిలిచింది.
అలాగే ట్విట్టర్ సెర్చింగ్ టాప్ 1లో సుశాంత్ సింగ్ నటించిన దిల్ బెచారా పేరు నిలిచింది. సుశాంత్ నటించిన దిల్‌బెచారా.. తమిళ చిత్రం సూరరైపోట్రూ.. మహేష్ సరిలేరు నీకెవ్వరు వరసగా మూడ స్థానాల్లో నిలిచాయి. దళపతి విజయ్.. విరుష్క.. అమితాబ్ తదితరులు ట్విట్టర్ ట్రెండింగ్ లో నిలిచారు.
కోవిడ్ -19 కోసం శోధన తర్వాత దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కి నివాళి అర్పిస్తూ ఎక్కువమంది సెర్చ్ చేశారు. హత్రాస్ లో ఒక యువ దళిత మహిళపై అత్యాచారాన్ని ఖండించిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. సినిమాలు - టెలివిజన్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 7000 కంటే ఎక్కువ ట్వీట్లు వచ్చాయి.