ఆ సీన్‌ లో సమంత.. అ..ఆ..

Update: 2016-01-22 13:30 GMT
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అ..ఆ.. చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అనసూయా రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో నితిన్ - సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ తో వరుసగా సినిమాలు చేస్తున్న హారిక హాసిని బ్యానర్ పైనే ఈ మూవీ కూడా తెరకెక్కతోంది. అ..ఆ.. మూవీ ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్.

ఈ మూవీలో స్క్రిప్ట్ ప్రకారం ఓ బెడ్ రూమ్ సన్నివేశం కూడా ఉందని తెలుస్తోంది. మూవీకి ఈ సీన్ చాలా కీలకం కావడంతో.. ఈ సీన్ తప్పనిసరిగా తీయాల్సి వచ్చిందట. రీసెంట్ గా నితిన్ - సమంతలతో ఈ బెడ్ రూమ్ సన్నివేశం షూటింగ్ కూడా కంప్లీట్ చేశాడట డైరెక్టర్. అయితే.. ఏ మాత్రం అసభ్యంగా లేకుండా, చాలా డీసెంట్ గా ఈ సీన్ తెరకెక్కించినట్లు చెబుతున్నారు. ఇఫ్పటికే 70శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీలో.. ఇందులో రొమాంటిక్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా పుష్కలంగా ఉంటాయట. సమంతతోపాటు.. మళయాళ మూవీ ప్రేమమ్ ఫేం అనుపమా పరమేశ్వరన్ కూడా.. ఈ చిత్రంలో ఓ కీలకమైన రోల్  చేస్తోంది. వీరితోపాటు అనన్య నితిన్ చెల్లెలిగా నటించనుండడం విశేషం.

నదియా నితిన్ కి తల్లి పాత్ర పోషిస్తుండగా.. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ మూవీని.. మార్చ్ నాటికి రిలీజ్ చేయాలన్నది త్రివిక్రమ్ ఆలోచనగా తెలుస్తోంది. అనిరుధ్ మ్యూజిక్ ఇస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా నటరాజ్ సుబ్రమణియన్ వ్యవహరిస్తున్నారు.
Tags:    

Similar News