95 కోట్లు మాత్రం పక్కా.. ఆ తరువాత చూడాలి

Update: 2017-01-21 17:15 GMT
ఆల్రెడీ భారీ కలక్షన్లతో సంక్రాంతి బొనాంజా ''ఖైదీ నెం 150'' దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి తాలూకు వన్నెతరగని క్రేజ్ అనండీ లేకపోతే ఈయన కంబ్యాక్ కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారని అనండీ.. ఈయన సినిమా మాత్రం దూసుకుపోతోంది అంతే. 11వ రోజు సాయంత్రంతో శ్రీమంతుడు సినిమా లైఫ్‌ టైమ్ కలక్షన్లను దాటేస్తోందని కూడా ఆల్రెడీ చెప్పేసుకున్నాం.

ట్రేడ్ పండిట్స్ ఈ సందర్భంగా ఖైదీ నెం 150పై భారీ అంచనాలతో ఉన్నట్లు చెబుతున్నారు. వచ్చే జనవరి 26న కూడా ఎటువంటి కొత్త సినిమాల రిలీజులు లేకపోవడం.. ఉన్నా కూడా కేవలం సూర్య సింగం 3 ఒక్కటే ఉండటంతో.. అసలు ఖైదీ నెం 150కు ఇప్పుడప్పుడే హవా తగ్గే ఛాన్సే లేదని వీరి ఉవాచ. ఇకపోతే లైఫ్‌ టైమ్ లో సినిమా ఎంత కలక్ట్ చేయొచ్చు అంటే.. దాదాపు 95 కోట్లు వరకు షేర్ తెచ్చేయడం మాత్రం పక్కా అనేది ట్రేడ్ పండితులు చెబుతున్న జోస్యం. ఒకవేళ 100 కోట్ల షేర్ టచ్ చేస్తుందో చేయదో తెలియదు కాని.. 95 కోట్ల వరకు ఢోకా ఉండదట.

ఒకవేళ 100 కోట్లు వసూలైనా కూడా ఖైదీ నెం 150 క్రియేట్ చేసేది నాన్ బాహుబలి రికార్డ్ అవుతుంది. ఎందుకంటే.. 87 రోజుల్లో బాహుబలి పార్టు 1 షుమారుగా 190 కోట్ల షేర్ ను తెలుగు వర్షన్ నుండి రాబట్టింది. ఆ ఫిగర్స్ ను టచ్ చేయడం అసాధ్యం అనే విషయం తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News