సినిమాలలో కిట్టయ్య..

Update: 2015-09-05 05:11 GMT
చిట్టిపొట్టి అడుగులు వేసుకుంటూ చిన్నారి కృష్ణుడి అడుగులతో మీ ఇంటని పావనం చేసే శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. నిజానికి శ్రీ కృష్ణుడికి మన తెలుగు సినిమాలకు విడదీయరాణి అనుబంధముందండోయ్.. కృష్ణాష్టమికి అనగానే గుర్తొచ్చే కోలాహలం ఉట్టి కొట్టడం. సూపర్ స్టార్ రజినికాంత్ నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు వరకూ ఈ ఉట్టి కొట్టి ఎంట్రీ ఇచ్చిన సీన్లు ఎన్నో..

అలానే కృష్ణుడి పేరు చెప్పగానే దేవుడి తరువాత మనకు స్మురించే రూపం నందమూరి తారక రామారావుగారు. మాయాబజార్ చిత్రం మొదలుకుని ఎన్నో పౌరాణిక చిత్రాలలో కృష్ణుడి పాత్రకే వన్నె తెచ్చిన ఘనజీవి ఆయన. ఇక మన తెలుగు ఫాంటసీ సినిమాలలో హీరోలు ఈ కలి యుగంలో కృష్ణుడి సహాయంపొంది నెగ్గుకొచ్చిన సందర్భాలూ వున్నాయి. పవన్ కళ్యాణ్ వెంకీల గోపాల గోపాల, రాజేంద్ర ప్రసాద్ కన్నయ్య కిట్టయ్య, విష్ణు - నాగార్జున ల కృష్ణార్జున సినిమాలు ఆ కోవకు చెందినవే. సినిమాలలోనే కాక కార్టున్ లలో కూడా పిల్లలకు కృష్ణుడే ఫేవరేట్ హీరో.. ఇలా మన తెలుగు సినిమాలో ఎప్పటికీ కృష్ణుడు ఏకమయ్యే వుండాలని ఆశిస్తున్నాం. ఇంతకీ "కిత్నాత్నమి అంటే కిత్నుడి బర్త్ డే"...
Tags:    

Similar News