పిక్‌ టాక్ : స్టైలిష్ అందాల కియారా అదుర్స్‌

కియారా అద్వానీ కారులో అలా క్యాప్‌ పెట్టి, లూజ్ హెయిర్ తో వైట్‌ టీ షర్ట్‌ తో క్లోజప్ లో తీసుకున్న ఈ సెల్ఫీ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

Update: 2024-04-28 00:30 GMT

భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఉత్తరాది ముద్దుగుమ్మ కియారా అద్వానీ. ఈ అమ్మడు ఆ వెంటనే వినయ విధేయ రామ సినిమాలో నటించింది. మొదటి సినిమా సూపర్‌ హిట్‌ అవ్వగా రెండో సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.

 

వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్ అయినా కూడా రామ్‌ చరణ్‌ తో మరో సినిమాను చేసే అవకాశం దక్కించుకుంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ సినిమా గేమ్‌ చేంజర్ లో చరణ్‌ తో కలిసి నటిస్తున్న విషయం తెల్సిందే. సినిమాలతో ఎంత పాపులారిటీని సొంతం చేసుకుందో సోషల్‌ మీడియా ద్వారా కూడా కియారా అంతటి పాపులారిటీ సొంతం చేసుకుంది.

ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ ఫ్యాన్స్ అంటూ ఉంటారు. సాధారణంగా హీరోయిన్స్ స్కిన్‌ షో చేస్తే ఆ ఫోటోలు వైరల్‌ అవుతాయి. కానీ కియారా అద్వానీ ఏమాత్రం స్కిన్‌ షో చేయకున్నా ఇలా స్టైలిష్‌ లుక్‌ లో సెల్ఫీ తీసుకుని షేర్‌ చేసినా కూడా వైరల్‌ అవుతోంది.

కియారా అద్వానీ కారులో అలా క్యాప్‌ పెట్టి, లూజ్ హెయిర్ తో వైట్‌ టీ షర్ట్‌ తో క్లోజప్ లో తీసుకున్న ఈ సెల్ఫీ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఇంతటి అందాల ముద్దుగుమ్మకు బాలీవుడ్‌ లో వరుస ఆఫర్లు వస్తున్నాయి.

పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు జోరు ఏమాత్రం తగ్గించకుండా వరుస సినిమాలతో దూసుకు పోతుంది. ఇంతటి అందగత్తెకు మరో పదేళ్ల వరకు స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు రావడం కన్ఫర్మ్‌ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News