టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణలో భాగంగా ఈరోజు బుధవారం హీరో రానా దగ్గుబాటి ఈడీ ఎదురు హాజరయ్యారు. మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. దర్యాప్తు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. నాలుగేళ్ళ క్రితం నాటి కేసులో ఇప్పుడు దూకుడు పెంచిన ఈడీ.. ఇప్పటికే నోటీసులు జారీ చేసి పలువురిని ప్రశ్నించింది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - నటి ఛార్మి కౌర్ - హీరోయిన్ రకుల్ సింగ్ లను అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించి వారి స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేశారు. నిన్న మంగళవారం యువ హీరో నందు తో పాటుగా డ్రగ్ పెడ్లర్ కెల్విన్ లను దాదాపు 8 గంటల పాటు ఈడీ విచారించింది. వీర్ వద్ద నుంచి అధికారులు కీలక విషయాలు రాబట్టినట్లు కథనాలు వస్తున్నాయి.
సంచలనం సృష్టిస్తోన్న డ్రగ్స్ కేసులో ఇప్పుడు రానా వంతు వచ్చింది. తన పర్సనల్ స్టాఫ్ తో కలిసి రానా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలు తీసుకురావాల్సిందిగా ఈడీ నోటీసుల ద్వారా ముందుగానే రానా ని కోరింది. ఈ మేరకు ఎఫ్ క్లబ్ మరియు అందులో రానా హాజరైన పార్టీల గురించి.. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇకపోతే డ్రగ్స్ వ్యవహారాల్లో మనీ లాండరింగ్ జరిగిందని 12 మందికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో రవితేజ - ముమైత్ ఖాన్ - నవదీప్ - తనీష్ - తరుణ్ లను ఈడీ విచారించనుంది.