పూరీ వింటున్నావా.. గోవాలో ఆ సీన్లు బ్యాన్
బ్యాంకాక్ .. థాయ్ లాండ్.. అంటే సెలబ్రిటీ బీచ్ లు. అక్కడ ఉన్నంత స్వేచ్ఛ ఇంకెక్కడా కుదరదు. ఇక ఇండియాలో అయితే గోవా బీచ్ లకు ఈ స్వేచ్ఛ ఉంది. సినిమా షూటింగ్ లకు గోవా అనువైన ప్రదేశం. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం.. సముద్ర తీరం విదేశీ అట్మాస్పియర్ ప్రత్యేక ఆకర్షణ. షూటింగ్ లకు అనుమతులు చాలా సులువు. అందుకే దర్శకులు అక్కడో షెడ్యూల్ ఉండేలా చేసుకుంటారు. పెద్ద సినిమా..చిన్న సినిమా అనే తారతమ్యం లేకుండా ప్రతి సినిమా షూటింగ్ అక్కడ జరుగుతుంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలు తరుచూ షూటింగ్ లకు ఇక్కడ ప్రాధాన్యతనిస్తుంటారు. అశ్లీల సన్నివేశాల్ని ఇక్కడ స్వేచ్ఛగా చిత్రీకరించే వెసులుబాటు ఇప్పటివరకూ ఉండేది. బీచ్ లో మాఫియా సన్నివేశాలు.. డ్రగ్స్ విచ్చల విడితనానికి సంబంధించిన సన్నివేశాల్ని ఇక్కడ షూట్ చేస్తుంటారు.
గోవా ఒకరకంగా దర్శక నిర్మాతలకు అత్తారిల్లులాంటిది అని ఓ పెద్దాయన కామెంట్ చేశారంటే అర్థం చేసుకోవాలి. అక్కడ అడిగే వాడు... పట్టించుకునే వాడు ఉండకపోవడమే చిలౌట్ అంటుంటారు. అయితే ఇకపై అలాంటి వేషాలు గోవాలో కుదరవు. అక్కడ సినిమా షూటింగ్ లకు అంత ఈజీగా అనమతులు వచ్చే సీన్ లేదు. షూటింగ్ చేయాలంటే ముందుగా స్క్రిప్టును ప్రభుత్వానికి అప్పగించాలి. అది చదివాక అందులో అసభ్యత ను...ఆల్కహాలిక్ వ్యవహారాల్ని అధికారులు రివ్యూలు చేస్తారట. ఆ తర్వాతే అనుమతులొచ్చే విధంగా ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది.
ఎంటర్ టైన్ మెంట్ సోసైటీ ఆఫ్ గోవా! అంటూ ప్రభుత్వం కొత్తగా ఒక కమిటీని ప్రభుత్వం నియమిస్తుందని గోవా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఉన్నట్లుండి ఇంత కఠినమైన నిబంధంనలకు దేనికి? అంటే గోవా రాష్ట్రం పరువు పోతోందనే ఆవేదన ప్రజల్లో వ్యక్తమవుతోందట. సినిమా వాళ్ల వల్లనే గోవా పరువు బజారున పడుతోందని స్థానిక జనం అంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ షూటింగుల విషయంలో అధికారులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోనున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ చిత్రం `మళంగ్` లో మాదక ద్రవ్యాలు తీసుకునే వారికి గోవా ఓ స్వర్గంలా ఉంటుందని చూపించడంతో గోవా ప్రతిష్ట దెబ్బతిందని అక్కడ ప్రజలకు ఈ కల్చర్ ఇబ్బందికరమేనని అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఈ కొత్త నిబంధన మన దర్శకనిర్మాతలకు వినిపిస్తోందో లేదో!