సూర్య-సెల్వ రాఘవన్ చిత్రం ఆరోజే విడుదల

Update: 2018-11-15 13:44 GMT
తమిళ స్టార్ హీరో సూర్య విలక్షణ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో 'ఎన్ జీ కే' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు నిర్మాతలు.  రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 న ఈ సినిమాను విడుదల చేస్తారట.  

వారం రోజుల షూటింగ్  మాత్రమే పెండింగ్ ఉందని.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ఇప్పటికే మొదలు పెట్టామని నిర్మాతలు వెల్లడించారు.  జనవరి రిలీజ్ అనుకుంటున్నారు కాబట్టి డిసెంబర్లో ప్రచార కార్యక్రమాలు మొదలు పెడతారట.  ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్.. సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీత దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను SR.ప్రభు నిర్మిస్తున్నారు.

ఈమధ్య కాలంలో సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఒక్కటి కూడా విజయం సాధించలేదు. ఇలాంటి పరిస్థితిలో సూర్య లాంటి పెద్ద స్టార్ సెల్వరాఘవన్ కు అవకాశం ఇవ్వడం మాత్రం చాలా గొప్పవిషయమే. సక్సెస్ సంగతి పక్కనబెడితే సెల్వ ఒక బ్రిలియంట్ డైరెక్టర్. మరి ఈ 'ఎన్ జీ కే' తో అయినా తన కెరీర్లో బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో వేచి చూడాలి.
Tags:    

Similar News