పోర్న్ లేకుంటే నేనొక డమ్మీ- సన్నీ

Update: 2015-12-01 17:30 GMT
పోర్న్ సినిమాల తననీ స్థాయికి తెచ్చాయని.. ఆ సినిమాల విషయంలో తాను ఎంతమాత్రం చింతించట్లేదని అంటోంది సన్నీ లియోన్. తాను ఎందుకు పోర్న్ సినిమాలు చేశానని ప్రశ్నించే వాళ్లు.. తాను ఆ సినిమాలు చేయకుండా ఇండియాకు వస్తే తనను అసలు పట్టించుకునేవాళ్లా అని ప్రశ్నిస్తోంది సన్నీ.

‘‘పోర్న్ సినిమాలు చేయకుండా నేను ఇండియాలో అడుగుపెట్టి ఉండే నాకు ఏ గుర్తింపూ ఉండేది కాదు. నన్నెవరూ పట్టించుకునేవారు కాదసలు. ఆ సినిమాలు చేశాను కాబట్టే నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కాబట్టి నా బ్యాగ్రౌండ్ విషయంలో నేనెప్పుడూ రిగ్రెట్ కాను’’ అని చెప్పింది సన్నీ.

బాలీవుడ్ ఇండస్ట్రీ జనాలు తనను అదోలా చూసినప్పటికీ.. ప్రేక్షకులు మాత్రం తనను బాగా ఆదరిస్తున్నారని.. వాళ్ల అండదండలున్నంత కాలం సాఫీగా ఇక్కడే కెరీర్ కొనసాగిస్తానని సన్నీ చెప్పింది. తనతో నటించొద్దని హీరోలకు వాళ్ల భార్యలు చెప్పడాన్ని తాను పట్టించుకోనని.. తాను చేసిన సినిమాల ద్వారా కాకుండా తనేంటో తెలుసుకుని ఇలాంటి షరతులు పెడితే బావుంటుందని సన్నీ సెటైర్ వేసింది. ఇండియాలో సొంతిల్లు కొనుక్కునే విషయంలో తాను, తన భర్త ఆలోచిస్తున్నామని.. మున్ముందు కెరీర్ ఎలా ఉంటుందన్న దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని సన్నీ చెప్పింది.
Tags:    

Similar News