ఆ సినిమాలను వదిలేస్తా అంటోంది

Update: 2016-05-05 07:30 GMT
సన్నీలియోన్.. ఈ మాజీ పోర్న్ స్టార్ మన దేశంలో చాలామంది కుర్రాళ్లకి కలలరాణి. బాలీవుడ్ హీరోయిన్ గా కూడా మారాక బోలెడంత డిమాండ్ వచ్చేసింది. ఇండియా జనాలు అత్యధికంగా ఇంటర్నెట్ లో వెతుక్కునేది ఈమె కోసమే. అలాంటిది ఇప్పుడు సన్నీ ఓ బాంబ్ పేల్చేసింది. తనకు ఏ రకమైన సినిమాలైతే పేరు తెచ్చాయో.. ఇకపై వాటికి దూరం దూరం అనేస్తోంది.

సన్నీకి అంత ఫేమ్ రావడానికి కారణం ఆమె నటించిన పోర్న్ మూవీస్. ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా అడల్ట్ కంటెంట్ చిత్రాలే చేయడంతో.. క్రేజ్ మరింతగా పెరిగింది. కానీ ఇప్పుడు సన్నీ లియోన్ రేంజ్ మారుతోంది. బాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా సన్నీతో కలిసి సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. కింగ్ ఖాన్ షారూక్ అయితే.. ఇప్పటికే సన్నీతో ఓ ఐటెం సాంగ్ కూడా చేసేస్తున్నారు. అమీర్ - సల్మాన్ లాంటి హీరోలు కూడా ఈమెతో సినిమాలకు అభ్యంతరం లేదని చెబుతున్నారు.

అందుకే ఇకపై అడల్ట్ కంటెంట్  సినిమాలకు దూరమవుతానంటోంది సన్నీ లియోన్. 'ఇప్పుడు మామూలు సినిమాల్లోనే నటించాలని అనుకుంటున్నా. అడల్ట్ సినిమాలు చేయను. వీటిలోనే నటిస్తుంటే.. ప్రేక్షకులకు ఆసక్తి తగ్గింపోతుంది. ఒకవేళ మంచి స్క్రిప్ట్ దొరికితే ఆలోచిస్తాకానీ.. ఇకపై మాత్రం సాధారణ సినిమాలే చేస్తా' అంటూ సన్నీ స్టేట్మెంట్ ఇచ్చేసింది. దీంతో చాలామంది కుర్రాళ్లు ఇప్పటికే బెంగ పెట్టేసుకున్నారు.
Tags:    

Similar News