ఈసారి చిరంజీవిని మిస్సవని సునీల్

Update: 2016-07-30 15:42 GMT
మొన్నామధ్యన సునీల్ కోసం ఒక గోల్డెన్ ఆఫర్ ఇచ్చాడు వినాయక్. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలో హీరో ప్రక్కన ఫుల్ లెంగ్త్ కనిపించే కమెడియన్ ఫ్రెండ్ క్యారెక్టర్ మనోడికే ఆఫర్‌ చేశాడు. కాని అప్పటికే చాలా సినిమాలకు డేట్లు ఇచ్చేసిన సునీల్.. చిరంజీవి సినిమా కోసం డేట్లు ఎడ్జస్ట్ చేయడం కష్టమవుతోందని తెగ ఫీలయ్యాడట. ఈ విషయం స్వయంగా తనే చెప్పాడు కూడా. అయితే ఆఫర్ మరోసారి సునీల్ తలుపు తడితే ఎలా ఉంటుంది?

అదిగో కరక్టుగా అలాగే జరిగింది. ఇదే సినిమాలో కేవలం రెండు సీన్లలో మాత్రం మెరిసే మరో ఫన్నీ క్యారెక్టర్ ఒకటి ఉందట. ఈ పాత్రను చేస్తావా అని అడిగితే.. అయ్యా డేట్లు ఎప్పుడు కావాలో చెప్పండి అంటూ.. సెప్టెంబర్లో ఈ షూటింగులో జాయిన్ అవ్వడానికి ప్రిపేర్ అయిపోయాడట సునీల్‌. మెగాస్టార్ ప్రక్కనే ఓ రెండు సీన్లలో మెరిసినా చాలా అంటూ ఉత్సాహపడుతున్నాడట. ఇదే విషయాన్ని వినాయక్ మెగాస్టార్ దృష్టికి తీసుకెళితే ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారట. పైగా చిరుకు సునీల్ చాలా పెద్ద ఫ్యాన్ కూడా.. ఆ మాత్రం కిక్కు ఉంటుందిలే.

సినిమాల విషయానికొస్తే.. జక్కన్న సినిమాను ఆల్రెడీ రిలీజ్ చేసేసిన సునీల్.. ఇప్పుడు వీడు గోల్డేహా సినిమా మీద ఫోకస్ పెట్టునున్నాడట. మండే నుండి ఆ సినిమా షూటింగులో ఫుల్ బిజీ అని తెలుస్తోంది.
Tags:    

Similar News