'ఎన్టీఆర్‌' లో సుమంత్‌ మొదటి సీన్‌ ఇదే

Update: 2018-09-24 06:41 GMT
ఎన్టీ రామారావు బయోపిక్‌ ‘ఎన్టీఆర్‌’ చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. నవంబర్‌ కు చిత్రీకరణ పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ఏమాత్రం గ్యాప్‌ ఇవ్వకుండా చకచక చిత్రీకరణ పూర్తి చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి సమాచారం అందుతుంది. ఇటీవల విడుదలైన ఎన్టీఆర్‌ - చంద్రబాబు నాయుడు - ఏయన్నార్‌ ల లుక్‌ లు అదిరి పోయాయి. సినిమాకు మరింత హైప్‌ ను తీసుకు వచ్చాయి. ఆ పాత్రల్లో నటిస్తున్న బాలయ్య - రానా - సుమంత్‌ లు జీవించేశారు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

‘ఎన్టీఆర్‌’ లో ఏయన్నార్‌ పాత్రను పోషిస్తున్న సుమంత్‌ తన షూటింగ్‌ అనుభవాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో షేర్‌ చేసుకున్నాడు. తాతగారి పాత్ర అనగానే కాస్త భయం వేసింది. కాని ఒక భాద్యతగా తీసుకుని ఆ పాత్రను చేయడం జరిగింది. షూటింగ్‌ మొదటి రోజు తాతగారు చివర్లో వాడిన కారులో వెళ్ళాను. ‘ఎన్టీఆర్‌’ చిత్రం మొదటి రోజు చిత్రీకరణలో తాను పాల్గొన్న సమయంలో సీఎంగా ఎన్టీఆర్‌ ప్రమాణ స్వీకారం చేస్తున్న సీన్స్‌ను క్రిష్‌ గారు చిత్రీకరించారు. షూటింగ్‌ లో నాతో పాటు చంద్రబాబు నాయుడు పాత్రలో రానా కూడా పాల్గొన్నాడు.

‘ఎన్టీఆర్‌’ చిత్రంలో ఏయన్నార్‌ పాత్ర కోసం బాలకృష్ణ గారు చాలా సలహాలు సూచనలు ఇచ్చారు, తాతగారిని ఆయన దగ్గర నుండి చూసిన కారణంగా పలు ఆసక్తికర విషయాలను నాతో షేర్‌ చేసుకున్నారని - నాకు ధైర్యం ఇచ్చాడు - ఆయన సలహాలు మరియు సూచనలు నాకు చాలా ఉపయోగపడ్డాయి అంటూ సుమంత్‌ చెప్పుకొచ్చాడు. ఏయన్నార్‌ లుక్‌ కు సుమంత్‌ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుని అప్పుడే విజయాన్ని సొంతం చేసుకున్నాడు అంటూ అక్కినేని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో ఏయన్నార్‌గా సుమంత్‌ నాలుగు అయిదు గెటప్స్‌ లో కనిపిస్తాడని సమాచారం అందుతుంది.
Tags:    

Similar News