స్పెషల్ స్టోరీ: మెరుపు తీగల్ని పెళ్లాడిన స్టార్ హీరోలు
వెండితెర స్టార్స్ జీవితాలు ఎప్పుడూ ప్రత్యేకమే. వారి వ్యక్తిగత జీవితాల్లోకి అభిమానులు తొంగి చూడాలనుకుంటున్నారు. స్టార్ లకు సంబంధించిన ప్రతి అంశాన్ని చాలా ప్రత్యేకం గా చూస్తుంటారు. అందులోనూ తమ ఫేవరెట్ పెళ్లాడే లక్కీ గాళ్ ఎవరు? అంటూ ఆరాలు తీస్తారు. వెండి తెర పై అందాల భామతో రొమాన్స్ చేసే తమ హీరో రియల్ లైఫ్ లో అలాంటి అమ్మాయినే పెళ్లాడతాడా? లేక మరోలా వ్యవహరిస్తాడా? అని అభిమానుల్లో చర్చ జరుగుతూ వుంటుంది. ఆ అంచనాలకు మించి అందమైన భార్యల్ని దక్కించుకున్న స్టార్స్ మన దక్షిణాదిలో చాలా మందే వున్నారు.
వారి గురించి నిత్యం చర్చ జరుగుతూనే వుంటుంది. ఆ జంటల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. ఈ వరుసలో ముందుగా చెప్పాల్సిన పేరు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్. రజనీది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. కాలేజీ మ్యాగజైన్ కోసం రజనీని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన లతని తొలి చూపులోనే ప్రేమించారట. వెంటనే తనని పెళ్లిచేసుకుంటావా అని లతని అడగడం.. తన వాళ్లని అడిగి చెబుతానని లత చెప్పడం.. ఆ తరువాత తెలిసిందే. ఆ తరువాత చెప్పుకోవాల్సిన జంట అక్కినేని నాగార్జున- అమల. వీరిది లవ్ మ్యారేజ్ అన్నది తెలిసిందే. 1990లో తన భార్య- వెంకటేష్ సోదరికి విడాకులిచ్చిన నాగార్జున ప్రేమించిన అమలని 1992లో వివాహం చేసుకున్నారు. వీరి జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇళయదళపతి విజయ్ దీ ప్రేమకథే. సంగీత సరుణ లింగం విజయ్ అభిమాని. ఆమె మెడలోనే విజయ్ తాళికట్టారు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు. తనయుడు జేసన్ విజయ్ త్వరలో హీరోగా పరిచయం కాబోతున్నాడు. స్టార్ కపుల్ సూర్య- జ్యోతిక ల జంటది కూడా ప్రేమ పెళ్లే. చాలా కాలం ప్రేమలో వున్న ఈ జంట ఆ తరువాత వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్, నమ్రతల ప్రేమ పెళ్లి గురించి తెలిసిందే. `వంశీ` టైమ్ లో ప్రేమలో పడిన ఈ జంట 2005లో వివాహం చేసుకున్నారు. నవ్రత ఎంటరైన తరువాతే మహేష్ కెరీర్ కూడా మారిపోయింది. వీరిలాగే మరో తమిళ జోడీ అజిత్, షాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2000 సంవత్సరం లో వీరి వివాహం జరిగింది. మ్యాడీ మాధవన్ తన సహ నటి సరితా బిర్డేని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1999లో వీరి వివాహం జరిగింది.
ఇక మన స్టార్ హీరోలు రామ్‌చరణ్, బన్నీలది ప్రేమ వివాహమే. ఈ ఇద్దరూ రెడ్డీ కయ్యూనిటీకి చెందిన వారిని వివాహః చేసుకున్నారు. రామ్‌చరణ్ అపోలో హాస్పటల్స్ అధినేత స్రతాప్ సి. రెడ్డి ముద్దుల మనవరాలు ఉపాసనని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిది చిన్ననాటి స్నేహం. అదే ప్రేమగా మారి పెళ్లిదాకా వెళ్లింది. బన్నీ... స్నేహారెడ్డీలదీ లవ్ స్టోరీ నే. కొంత కాలం సీక్రెట్ గా ప్రేమాయణం సాగించిన బన్నీ మొత్తానికి కోరుకున్న స్నేహారెడ్డినే వివాహం చేసుకుని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎన్టీవోడి రేంజుకి తగ్గ అందం ఆమె సొంతం. ఇలా దక్షిణాది స్టార్స్ అందమైన భామల్ని లేత మెరుపు తీగల్ని భార్యలు గా తెచ్చుకుని తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.