సెట్స్ లో అడుగుపెడుతున్న స్టార్ హీరోలు...!
కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. సినిమా షూటింగ్స్ ఆగిపోవడంతో పాటు థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. దీంతో థియేటర్స్ లో బొమ్మపడక ఐదు నెలలు అయింది. సినిమాపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ మధ్య కొన్ని షరతులతో ప్రభుత్వాలు షూటింగ్స్ కి మరియు మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసుకోడానికి అనుమతించారు. ఈ నేపథ్యంలో సినిమా మరియు టీవీ షోల షూటింగ్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అయితే అవుట్ డోర్ షూట్స్ కి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం ఇండోర్ షూటింగ్స్ కే పరిమితం అవుతున్నారు.
ఈ క్రమంలో సీనియర్ హీరో కింగ్ నాగార్జున కూడా సెట్స్ లో అడుగుపెట్టడానికి రెడీ అయ్యారు. తాను హోస్ట్ చేయబోయే 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 4లో షూటింగ్ లో పాల్గొంటున్నాని అక్కినేని నాగార్జున స్వయంగా పేర్కొన్నాడు. దీంతో పాటు నాగ్ నటిస్తున్న 'వైల్డ్ డాంగ్' సినిమా షూటింగ్ కూడా ఆగస్టు 31 నుంచి స్టార్ట్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'వైల్డ్ డాగ్' మిగితా షూటింగ్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని నాగ్ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోల్లో అందరి కంటే ముందే నాగార్జున సెట్స్ లో అడుగుపెడుతున్నారని చెప్పవచ్చు.
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కూడా షూటింగ్ లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతన్య నటిస్తున్న 'లవ్ స్టోరీ' చిత్రాన్ని సెప్టెంబర్ 7న స్టార్ట్ చేసి సింగిల్ షెడ్యూల్ లో మిగతా చిత్రీకరణ కంప్లీట్ చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయిందని తెలుస్తోంది. ఇందుకోసం చిత్ర యూనిట్ మొత్తం షూటింగ్ జరిగినన్నాళ్లు సెట్స్ లోనే ఉండేలా ప్లాన్స్ చేసుకుంటున్నారని సమాచారం. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా సెప్టెంబర్ రెండో వారం నుండి 'రాధే శ్యామ్' షూటింగ్ లో పాల్గొంటారని డైరెక్టర్ రాధా కృష్ణ ఇప్పటికే ప్రకటించారు. సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ తక్కువ మంది సిబ్బందితో షూట్ చేయనున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతానికి షూటింగ్స్ లో పాల్గొనడానికి సిద్ధమని ప్రకటించిన స్టార్స్ వీరు ముగ్గురు మాత్రమే. సినిమా షూటింగ్స్ స్టార్ట్ అవడం వల్ల ఇన్ని రోజులు నానా అవస్థలు పడుతూ వస్తున్న సినీ కార్మికులకు పని లభించే అవకాశం ఉంది. నాగార్జున - ప్రభాస్ - నాగచైతన్య దారిలో మిగతా హీరోలు కూడా రిస్క్ తీసుకోడానికి రెడీ అవుతారేమో చూడాలి.