పవన్ అంటే ఇష్టం.. కానీ ఆ పని నావల్ల కాదు: స్టార్ డైరెక్టర్ కామెంట్స్
దాదాపు మూడు సంవత్సరాల రాజకీయ విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. వేణుశ్రీరామ్ రూపొందించిన ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. రీమేక్ సినిమా అయినా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందులోను మహిళపై మంచి సందేశం ఉండటం అదనపు బలమనే చెప్పాలి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తో సినిమా ఛాన్స్ ఎప్పుడొస్తుందా ఎన్ని వెయిట్ చేస్తుంటారు డైరెక్టర్లు. కానీ ఒక డైరెక్టర్ మాత్రం పవన్ తో సినిమా చేయనని తేల్చిచెప్పేసాడు. ఆయనెవరో కాదు వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ. తాజాగా ఆయన 'ఆర్జీవి దెయ్యం' అనే సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.
అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ పై స్పందించాడు. తెలిసిందే కదా వర్మ రూట్ వేరని.. ఆయన మాట్లాడుతూ.. 'సినిమాలనే కాకుండా పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగతంగా ఎంతో ఇష్టం. ఆయన సినిమాలు ఎక్కువగా చూడను అలాగే వకీల్‌సాబ్ కూడా చూడలేదు. కానీ ట్రైలర్ చూశాను నచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, ఆ స్థాయి అంచనాలకు తగిన సినిమాలు చేయడం మాత్రం నా వల్ల కాదు. నేను కమర్షియల్ సినిమాలకంటే.. జోనర్ సినిమాలే ఎక్కువగా తీస్తాను. ఒకవేళ నేను పవన్ లాంటి హీరోతో సినిమా చేస్తే.. వాళ్లకే కాదు అది సినిమాకే మంచిది కాదు. ఫైనల్లీ నాకు కమర్షియల్ సినిమాలపై ఆసక్తి లేదు' అంటూ ఆయన స్టైల్ లో సెలవిచ్చాడు. ప్రస్తుతం రాజశేఖర్ తో రూపొందించిన పట్టపగలు సినిమానే 'దెయ్యం'గా పేరు మార్చి ఏప్రిల్ 16న ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నాడు వర్మ. ఈ సినిమాను నట్టి కరుణ, క్రాంతి, బి.వెంకట శ్రీనివాస్ లతో పాటు జీవిత రాజశేఖర్ కూడా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.