కొత్త నేపథ్యంతో రాబోతున్న 'శ్రీదేవి సోడా సెంటర్'..

Update: 2020-12-30 09:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త దర్శకులతో పాటు కొత్త కథలు కూడా పుంజుకుంటున్నాయి. ప్రేక్షకులకు ఏది కావాలో కొత్తగా వస్తున్న దర్శకులు బాగానే క్యాచ్ చేసి స్టోరీస్ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మధ్య సీనియర్ దర్శకుల కంటే కొత్త దర్శకులే వినూత్నమైన సినిమాలను రూపొందిస్తున్నారు. మరుగున పడిన ప్రాంతాల చరిత్రలను, ఆనాటి కథలను, ఇన్సిడెంట్లను స్క్రిప్ట్ రూపంలో తెరమీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలా తెరకెక్కి సూపర్ హిట్ అయిన సినిమాలలో ఒకటి పలాస 1978. డెబ్యూ డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి నేమ్ ఫేమ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను పూర్తిగా శ్రీకాకుళం నేపథ్యంలో అక్కడి బాషా, యాస కూడా ఎలా ఉండేవో చూపించారు మేకర్స్.

అయితే తాజాగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా 'శ్రీదేవి సోడా సెంటర్'. సుధీర్ బాబు కథనాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా.. టైటిల్, మోషన్ పోస్టర్ నుండే మంచి ఇంటరెస్ట్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా తూర్పు గోదావరి, రామచంద్రపురం పరిసరాలలో చిత్రికరణ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాను ఆ ప్రాంతాల నేపథ్యంలోనే రూపొందిస్తున్నాడు డైరెక్టర్ కరుణ కుమార్. ఇదిలా ఉండగా.. సుధీర్ బాబు చివరిగా నటించిన సినిమా వి. అలాంటి యాక్షన్ మూవీలో పోలీస్ గా కనిపించిన సుధీర్.. ఈ శ్రీదేవి సోడా సెంటర్ మూవీలో లైటింగ్ సూరిబాబుగా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాను 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి హిట్‌ సినిమాలను అందించిన విజయ్‌ చిల్లా, శశిదేవిరెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చూడాలి మరి కరుణ కుమార్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేయనున్నాడో..!!
Tags:    

Similar News