రెచ్చగొట్టడంలో ఫుల్ సక్సెస్ అంతే

Update: 2017-01-23 14:18 GMT
శ్రీయ సరన్. పరిచయం అక్కర్లేని పేరు. అలాగే వెండితెరపై ఆమె దారపోయని గ్లామరసం అంటూ ఏమీ లేదు. గత పదేళ్ళళ్ళలో తన గ్లామర్ తో కుర్రకారును ఉర్రూతలూగించేసినా కూడా.. ఆమెది ఇంకా వన్నెతరగని అందం అనే చెప్పాలి. మొన్నటి గౌతమిపుత్ర శాతకర్ణిలో గ్లామర్ టచ్ పెద్దగా ఇవ్వకపోయినప్పటికీ.. అదే సమయంలో చేసిన ఒక ఫోటో షూట్ తో అమ్మడు మత్తెక్కిస్తోంది.

అదిగో మొన్ననే శ్రీయ ''మై సౌత్ డివా'' అంటూ ఒక క్యాలెండర్ కోసం నానా రచ్చ చేసింది. అయితే ఈ క్యాలెండర్ షూట్ కు సంబంధించి మెయిన్ క్యాలెండర్ ఫోటోలు ఆల్రెడీ వచ్చేసినా కూడా.. ఇప్పుడు ఆ షూట్ లో తీసిన తక్కిన ఫోటోలతో రోజూ శ్రీయ అండ్ కాజల్ లు రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. సదరు షూట్ నుండి ఫోటోలను కాదు.. ఇప్పుడు షూట్ వీడియోలతో కూడా రచ్చ చేసేస్తున్నారు. ఎంతైనా శ్రీయ అందాలను అలా క్యాష్‌ చేసుకోవడంలో ఆ సంస్థ వారు సక్సెస్ అవుతుంటే.. తన హాట్ లుక్స్ తో 30ల ప్రాయంలో కూడా యువతను రెచ్చగొట్టేయడంలో శ్రీయ సక్సెస్ అవుతోంది.

ఇకపోతే శాతకర్ణి హిట్టు తరువాత మరి తెలుగులో శ్రీయకు ఇంకా ఒక్కటంటే ఒక్క ఆఫర్ కూడా రాలేదు. యంగ్ హీరోలకేమో వయస్సెక్కువైందని ఫీలింగట.. సీనియర్లకేమో ఆల్రెడీ చేసేశాంగా అనే ఫీలింగట. చూద్దాం అమ్మడికి అవకాశాలు ఎవరిస్తారో!!
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News