సందీప్ కొత్త ప్రాజెక్ట్ అఫిషియల్ అనౌన్స్ మెంట్
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ హీరోల దృష్టిని ఆకర్షించిన సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లో బిజీ అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. టాలీవుడ్ యంగ్ హీరోలు ఈయన దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నా కూడా అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేశాడు. అక్కడ కబీర్ సింగ్ సూపర్ హిట్ అవ్వడంతో అక్కడ కూడా సందీప్ కు మంచి పేరు వచ్చింది. వెంటనే అక్కడ మరో సినిమాను ప్రకటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సినిమా పట్టాలెక్కబోతుంది.
నేడు అర్థరాత్రి సమయంలో బాలీవుడ్ లో సందీప్ వంగ దర్శకత్వంలో రూపొందబోతున్న బాలీవుడ్ మూవీ ప్రకటన రాబోతుంది. రణబీర్ కపూర్ తో సందీప్ వంగ సినిమా చర్చలు దాదాపుగా ముగిశాయి. వచ్చే నెలలో సినిమాను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి అని త్వరలోనే సినిమా షూటింగ్ ను ప్రారంభించబోతున్నట్లుగా సందీప్ నేడు అర్థరాత్రి సమయంలో ప్రకటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత అయినా ఈయన తెలుగులో సినిమాను చేస్తాడేమో చూడాలి.