• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అంటే ఎఫైర్ ఉండేదని...

అంటే ఎఫైర్ ఉండేదని ఒప్పుకున్నట్టేగా!

By - Tupaki Desk
Update: 2020-03-20 07:31 GMT
ప్రతి ఒక్కరి జీవితంలో దాదాపుగా ఏదో ఒక విఫల ప్రేమ ఉంటుంది. మనం వారిని వదిలెయ్యడమో.. వారు మనల్ని వదిలించుకోవడమో.. ఇద్దరి పేరెంట్స్ ప్రేమికులను విడగొట్టడమో.. లేక ప్రేమికులు ఇద్దరూ చర్చించుకుని బ్రేకప్ పార్టీ చేసుకుని మరీ బైబై చెప్పుకోవడమే జరిగి ఉంటుంది. సాధారణ వ్యక్తుల జీవితంలోనే కాదు సెలెబ్రిటిల లైఫ్ లో కూడా ఇలాంటివి ఉంటాయి. స్టార్ హీరోయిన్ సమంత లైఫ్ లో కూడా ఇలాంటివి ఉన్నాయి.

ఈమధ్య సమంతా 'మోస్ట్ డిజైరబుల్ ఉమెన్' టాగ్ సాధించింది. ఈ సందర్బంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మాజీ లవర్ గురించి పరోక్షంగా మాట్లాడింది. "మహానటి సావిత్రి వ్యక్తిగత జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొందో నా జీవితంలో కూడా అలాంటివే జరిగాయి. నేను మందుగానే పసిగట్టడం తో ఆ బంధం నుంచి బయటపడ్డాను. తర్వాత చైతన్య లాంటి గొప్ప వ్యక్తి తో జీవితం పంచుకునే అవకాశం లభించింది" అంటూ మాజీ లవర్ పై ఓ బండ పడేసింది.

చైతన్య తో వివాహానికి ముందు.. అప్పుడెప్పుడో సమంతా-సిద్ధార్థ్ ల లవ్ స్టోరీ ఓ హాట్ టాపిక్. అయితే సమంతా ఎప్పుడూ ఆ విషయం గురించి ఒప్పుకోలేదు. మాట్లాడేందుకు ఇష్టపడలేదు. దీంతో అవి జస్ట్ రూమర్లు అన్నట్టుగానే మిగిలిపోయాయి. ఇన్నేళ్ళ తర్వాత.. అదీ చైతన్య తో వివాహం జరిగిన తర్వాత సామ్ "నా జీవితం సావిత్రి లైఫ్ లాగా అయి ఉండేది" అంటే దానర్థం లవ్ లో ఉండేదాన్ని అని ఒప్పుకున్నట్టేనని నెటిజన్లు అంటున్నారు.

అయినా పెళ్ళికి ముందు సమంతా - సిద్ధార్థ్ లవ్ సంగతి చాలామందికి తెలియదు. ఇప్పుడు ప్రత్యేకంగా అదంతా మాట్లాడి బయట పెట్టుకోవడం.. ఎక్కువ ప్రచారం కల్పించుకోవడం ఎందుకో మరి. ఇప్పుడు కనుక సిద్ధార్థ్ కూడా ఏదో ఒక కామెంట్ చేస్తే ఈ ఎపిసోడ్ సీరియల్ గా కొనసాగే అవకాశం పుష్కలంగా ఉంది.
Tags:    
  • Tollywood 
  • Tollywood news 
  • Latest News 
  • Tupaki Latest News 
  • Tupaki Updates 
  • samantha 
  • most desirable women of 2019 
  • siddharth 
  • love affair 

Similar News

షాకింగ్: బాలీవుడ్ మెగాస్టార్ కుటుంబంలో ఆస్తి వివాదాలు?

2026-11-13 04:09 GMT

సినిమా నిర్మాత‌కు, ఫైనాన్షియ‌ర్‌కు మ‌ధ్య ఉండే ప్ర‌ధాన‌మైన తేడా?

2026-11-13 04:08 GMT

Bigg Boss Telugu 10: దేబ్జానీకి, సుధీర్ కి అదిరిపోయే హింట్స్!

2026-11-13 04:06 GMT

'పుష్ప 2' రికార్డును బ్రేక్ చేయ‌లేక‌పోయిన రామాయ‌ణం-1

2026-11-13 02:45 GMT

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

2026-11-13 00:30 GMT

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

'ఇట్లు అర్జున' మూవీ రివ్యూ

2026-11-12 20:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS