అక్కినేని కపుల్ ముద్దులెట్టేస్తారేంటండీ??

Update: 2016-09-26 09:55 GMT
ఇప్పుడు ఫిలిం నగర్ అంతా దీని గురించే డిస్కషన్లు. అసలు అక్కినేని కపుల్ ఆ రేంజు ముద్దులతో ఇప్పుడు రెచ్చిపోతే ఎలా ఉంటుంది అనేదే అందరి సందేహం. ఇంతకీ అసలు ఈ కపుల్ ఎవరు.. ఈ ముద్దుల గోలేంటి.. అసలు వీరు ముద్దులు ఎందుకు పెట్టుకుంటారు? పదండి చూద్దాం.

ఇప్పటికే వివి వినాయక్ శిష్యుడి డైరక్షన్లో సమంత అండ్ నాగ చైతన్య లీడ్ రోల్స్ లో బాలీవుడ్ హిట్ మూవీ ''2 స్టేట్స్'' సినిమాను రీమేక్ చేస్తున్నారనే టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాను తీసినప్పుడు కూడా.. నవలలో ఉన్నట్లు ముద్దుల సన్నివేశాలను పెడతారా అనే సందేహం చాలామందికి వచ్చింది. కాని హీరో అర్జున్ కపూర్ అండ్ హాట్ గాళ్‌ ఆలియా భట్ మాత్రం.. ఎక్కడా తగ్గకుండా ముద్దులతో రెచ్చిపోయారు. ఆలియా సెక్సీగా అందాలను దారబోయడమే కాదు.. ముద్దుల సీనుల్లో అర్జున్ పెదాలను జుర్రేసింది. ఇప్పుడు మరి సమంత-చైతన్య కూడా ఆ సీన్లు చేస్తారా?

నిజానికి అసలు సమంత కాని చైతన్య కాని వెండితెరపై ఎక్కువసార్లు ఒకరితో ఒకరు పెదాలు కలిపారు తెలుసా. ఏ మాయ చేశావే, ఆటోనగర్ సూర్య, మనం.. ఇలా అన్ని సినిమాల్లోనూ వీరి ఘాటు పెదాల కలయికను చూపించేశారు. కాకపోతే ఇప్పుడు త్వరలోనే భార్యాబర్తలుగా మారబోతున్నారు కాబట్టి ఇప్పుడు వీరు అదే విధంగా ముద్దులు హద్దులు దాటిస్తారా అనేదే చూడాలి.
Tags:    

Similar News