అఖిల్5 ముద్దుగుమ్మ ఖరారు
అఖిల్ అక్కినేని ప్రస్తుతం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు. వచ్చే సంక్రాంతికి లేదా రిపబ్లిక్ డేకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో సంక్రాంతి తర్వాత అఖిల్ తన 5వ సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఇప్పటికే అఖిల్ 5వ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రూపొందబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ ను తాజాగా ఎంపిక చేసినట్లుగా మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలో పూజా హెగ్డేతో రొమాన్స్ చేసిన అఖిల్ తన తదుపరి సినిమాలో మోడల్ కమ్ హీరోయిన్ అయిన సాక్షి వైధ్యతో రొమాన్స్ కు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే ఆమె ఫొటో షూట్ చేయడంతో పాటు టెస్ట్ షూటింగ్ కూడా జరిగిందని అంటున్నారు. అఖిల్ కు ఆమె సరి జోడీగా దర్శకుడు సురేందర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడట. అందుకే అఖిల్ 5 సినిమాలో ఆమెను ఎంపిక చేయడం జరిగింది.
స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన ఈ సినిమాను అతి త్వరలోనే పట్టాలెక్కించాలని భావిస్తున్నారు. అఖిల్ ఈ సినిమాలో స్పై గా కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇండియన్ జేమ్స్ బాండ్ సినిమా మాదిరిగా ఈ సినిమా ఉంటుందని సురేందర్ రెడ్డి సన్నిహితులు అంటున్నారు.