చివరికి సినిమానే గెలిచింది.. చాలా థాంక్స్: మెగాహీరో
మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ఫుల్ ఖుషిగా ఉన్నాడు. ఎందుకంటే తాజాగా థియేటర్లలో విడుదలైన సోలో బ్రతుకే సో బెటర్ మూవీ మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. ఇక లాక్ డౌన్ తర్వాత మొదటి సినిమా కాబట్టి జనాలు వస్తారా రారా అనే సందేహంలో ఈ సినిమా హిట్ అవ్వడంతో ఇండస్ట్రీలో కొత్తగా ఆశలు చిగురించినట్లే కనిపిస్తుంది. ఇక తాజాగా సోలో బ్రతుకే సో బెటర్ సక్సెస్ మీట్ లో సాయితేజ్ మాట్లాడుతూ.. ముందుగా అందరికి థాంక్స్ తెలిపాడు. 'రెండు పాటలు మినహా సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయాక లాక్ డౌన్ వచ్చేసింది. లేదంటే అప్పుడే షూటింగ్ పూర్తి చేసి మే నెలలో విడుదల చేసేవాళ్ళం. లాక్ డౌన్ అయ్యేసరికి అసలు సినిమా రిలీజ్ అవుతుందా.. లేదా అనే అయోమయంలో పడిపోయాం. చాలా వరకు సినిమాలు ఓటిటిలో విడుదల అవుతున్నాయి. అందరూ టీవీలు, ఓటిటిలకు అలవాటు పడతారేమో అనే భయం ఉండేది. అలాంటి టైంలో మా ప్రొడ్యూసర్ కు జి5 ఓటిటి నుండి భారీ ఆఫర్ కూడా వచ్చింది. ఇక జీ వాళ్లకు అమ్మాలా వద్దా అనే కన్ఫ్యూషన్ లో ఉన్నప్పుడు.. సరే నిర్మాతకు లాస్ రావొద్దని ఓకే చెప్పేసాం. కానీ థియేటర్స్ ఓపెన్ అవుతాయనే హోప్ మాత్రం అలాగే ఉండేది.
ఒకవేళ థియేటర్స్ ఓపెన్ అయితే మాత్రం పక్కా థియేటర్లలోనే రిలీజ్ చేద్దాం. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్, ఒక ప్రొడక్షన్, డైరెక్టర్, కో-యాక్టర్ ఇలా అందరికి థియేటర్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ మాములుగా ఉండదు. అలాగే ఫస్ట్ టైం మూవీ డైరెక్టర్ తన పేరు థియేటర్ స్క్రీన్ మీద చూసుకుంటే వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. మేం షూటింగ్ కంప్లీట్ చేసి ఓటిటి వాళ్లకు కాపీ ఇచ్చేలోపు రెండు ప్రభుత్వాలు 50% సీటింగ్ తో థియేటర్లలో రిలీజ్ కి పర్మిషన్ ఇచ్చాయి. అందుకు రెండు తెలుగు ప్రభుత్వాలకు కృతజ్ఞతలు. ఇక మాకు సపోర్ట్ చేసిన జీ వారికీ చాలా థాంక్స్. సినిమా రిలీజ్ దగ్గర పడింది. చాలా ప్రాబ్లెమ్స్ ఎదుర్కొన్నాం. కానీ చివరికి సినిమానే గెలిచింది. అదే చాలు మాకు. ఇక మాకు రిలీజ్ టైంలో అండగా నిలిచిన తెలుగు ఇండస్ట్రీ, తెలుగు యాక్టర్స్ అందరికి చాలా థాంక్స్. చివరిగా సినిమాను గెలిపించిన ప్రేక్షకులకు చాలా థాంక్స్" అంటూ ఎమోషనల్ అయ్యాడు సాయితేజ్. ఇక నభా నటేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. డెబ్యూ డైరెక్టర్ సుబ్బు దర్శకత్వం వహించాడు.