ఏలూరులో షూటింగ్ మొదలుపెట్టనున్న మెగా మేనల్లుడు..!
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ - 'ప్రస్థానం' దేవకట్టా కాంబినేషన్ లో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. పొలిటికల్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రాన్ని జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ - జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచి ఏలూరుకి షిఫ్ట్ అవ్వబోతుందని తెలుస్తోంది. అయితే ఏలూరు ప్రస్తుతం పరిస్థితులు బాగా లేకపోవడంతో తగిన జాగ్రత్తలు తీసుకొని దానికి తగ్గట్లుగా షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ఉన్న సాయి ధరమ్ తేజ్.. నిహారిక పెళ్లి వేడుక మరియు రిసెప్షన్ అయిన వెంటనే షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది.
కాగా, సాయి తేజ్ కెరీర్ లో 14వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీకి ''రిపబ్లిక్'' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చనున్నాడు. ఇక ఈ సినిమాలో తేజ్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందని.. నటుడిగా మెగా హీరోని మరో స్థాయికి తీసుకుపోయే సినిమా అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే 'చిత్రలహరి' 'ప్రతిరోజూ పండగే' వంటి వరుస విజయాలు అందుకున్న సాయి తేజ్.. 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రాన్ని విడుదలకి సిద్ధం చేశాడు. దేవకట్టా తో సినిమా కంప్లీట్ చేసిన వెంటనే కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ మిస్టికల్ థ్రిల్లర్ లో నటించనున్నాడు.