రిపబ్లిక్ డే కు 'ఆర్ఆర్‌ఆర్' ట్రీట్ ఏంటో తెలుసా?
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్ మూవీ షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ప్రస్తుతానికి షూటింగ్ కు చిన్న బ్రేక్ అయితే ఇచ్చారు కాని వారం రోజుల్లోనే కొత్త షెడ్యూల్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్ చరణ్ కరోనా నెగటివ్ అనే రిపోర్ట్ వచ్చిన వెంటనే షూటింగ్ ను మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలోనే రాజమౌళి రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేసేందుకు ఒక మోషన్ పోస్టర్ ను డిజైన్ చేయిస్తున్నాడట. మరోసారి ఇద్దరు హీరోల లుక్స్ తో ఒకే పోస్టర్ లో ఇద్దరిని చూపించే విధంగా ఉంటుందట.
ఎన్టీఆర్ కొమురం భీమ్ లుక్ రామరాజు గా రామ్ చరణ్ లుక్ లపై ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. కనుక ఇద్దరిని ఈసారి మరింత విభిన్నంగా చూపించడంతో పాటు అందరి దృష్టిని ఆకర్షించేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను మార్చి వరకు పూర్తి చేయాలని భావిస్తున్నారు. జనవరి 26న విడుదల చేయబోతున్న పోస్టర్ లో సినిమా విడుదల తేదీ ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షూటింగ్ పూర్తి అయిన తర్వాత మరో టీజర్ ను విడుదల చేసి సినిమా విడుదల తేదీపై స్పష్టతనిచ్చే అవకాశాలు ఉన్నాయంటూ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.