#RRR రామారావు రామ్ ఎపుడెపుడా అని వెయిటింగ్!

Update: 2020-11-02 03:30 GMT
ఆర్.ఆర్.ఆర్ విష‌యంలో జక్క‌న్న మొండి ప‌ట్టుద‌ల ఇంకా అలానే కొన‌సాగుతోంద‌ట‌. నెవ్వ‌ర్ బిఫోర్ అన్న తీరుగా ఈ పాన్ ఇండియా సినిమాని తెర‌కెక్కించే మ‌రో సెన్సేష‌న్ క్రియేట్ చేయాల‌న్న త‌ప‌న పంతం ఆయ‌న‌లో అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయ‌న్న గుస‌గుసా వినిపిస్తోంది.

అయితే ఈ మూవీ చిత్రీక‌ర‌ణ‌ను వేగంగా ముగించి బ‌య‌ట‌ప‌డాల‌న్న రామ్ చ‌ర‌ణ్ .. ఎన్టీఆర్ పంతం మాత్రం నెర‌వేర‌డం లేదు పాపం. ఆయన వ‌ద‌ల‌రు.. వీళ్లు వెళ్ల‌రు! అన్న‌ట్టుగా ఉందిట సీను. ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్‌.. ఎన్టీఆర్ ఇద్ద‌రూ వేరే ప్రాజెక్టుల‌కు క‌మిట‌య్యారు. వాటికి సంబంధించి సెట్స్ కెళ్లిపోవ‌డానికి ప్ర‌తిదీ రెడీగా ఉంది. కానీ ఆర్.ఆర్.ఆర్ పెండింగ్ షూట్ పూర్తి చేయ‌నిదే జ‌క్క‌న్న వ‌ద‌ల‌డు. అందుకే ఆ ఇద్ద‌రూ ఎటూ తేల‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ట‌.

రామ్ చ‌ర‌ణ్ ఇప్ప‌టికే ఆచార్య షెడ్యూల్ విష‌య‌మై థింక్ చేస్తుంటే ఎన్టీఆర్ త‌దుప‌రి త్రివిక్ర‌మ్ తో షెడ్యూల్ విష‌య‌మై ఆలోచిస్తున్నార‌ట‌. రాజమౌళి శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ ముగించి త‌న‌ని విడిచిపెడితే బావుంటుంద‌ని  ఎన్టీఆర్ ప్రత్యేక అభ్యర్థన చేశార‌ట‌. పాన్ ఇండియా ఆర్.ఆర్.ఆర్ నుంచి భీమ్ లుక్ వ‌చ్చాక ఎంతో ఖుషీ అయిపోయిన అభిమానులు మునుముందు స‌రికొత్త టీజ‌ర్ ట్రైల‌ర్ కోసం వేచి చూస్తున్నారు.

అయితే తార‌క్ మాత్రం త్వ‌ర‌గా ఈ సినిమా షూటింగ్ ముగించి త‌దుప‌రి  ప్రీ-ప్రొడక్షన్ లో ఉన్న త్రివిక్రమ్ చిత్రాన్ని ప్రారంభించాల‌ని భావిస్తున్నాడు. కానీ రాజమౌళి ఎప్ప‌టికి పూర్తి చేస్తారు? అన్న‌దానిపై క్లారిటీ లేద‌ట‌. కరోనా విలన్ పాత్ర పోషిస్తుండ‌డంతో జ‌క్క‌న్న దేనినీ వేగంగా పూర్తి చేయాల‌ని అనుకోవ‌డం లేదు. ఎంతో జాగ్ర‌త్త‌గా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇది తార‌క్ కి ఇబ్బందిక‌రంగా మారింద‌ట‌.

వెంట‌నే త్రివిక్ర‌మ్ తో సినిమాని ప్రారంభించి రాజ‌మౌళికి టాటా చెప్పాల‌ని తార‌క్ సీరియ‌స్ గా థింక్ చేస్తున్నాడ‌ట‌. అందుకే జ‌క్క‌న్న‌ను బ‌తిమాలుకున్నాడ‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మరోవైపు రామ్ చరణ్ ఆచార్య షూటింగ్ కోసం వెయిటింగ్. ఎన్టీఆర్ కి అనుమ‌తి ఇస్తే త‌న‌కు కూడా వ‌చ్చేసిన‌ట్టేన‌ని ఆయ‌న వెయిట్ చేస్తున్నార‌ట‌.
Tags:    

Similar News