RRR బ్యూటీ హాలీవుడ్ కి ఛలో
పాన్ ఇండియా చిత్రం RRR తో బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడీగా అలియాభట్ నటిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో బిజీ నటిగా కొనసాగుతోన్న ఈ బ్యూటీ `ఆర్ ఆర్ ఆర్` తర్వాత టాలీవుడ్ లోనూ బిజీ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ లన్ని తెలుగులోనే ఎక్కువగా తెరకెక్కుతోన్న నేపథ్యంలో టాలీవుడ్ సినిమాకి ప్రత్యేకమై గుర్తింపు ఏర్పడింది. పాన్ ఇండియా..పాన్ వరల్డ్ అంటూ తెలుగు సినిమా స్థాయి అంతకంతకు పైపైకి ఎదుగుతోంది. దీంతో ఇతర భాషల నటులు సైతం తెలుగు సినిమాల వైపు చూస్తున్నారు. బాలీవుడ్ స్టార్లు ఇక్కడ నటించేందుకు వెనకాడడం లేదు.
ఈ నేపథ్యంలోనే ఆలియాభట్ వరుసగా టాలీవుడ్ చిత్రాలకు అంగీకరించే వీలుందన్న వాదనా తెరపైకి వచ్చింది. ఆ సంగతి అటుంచితే ఈ యువ కథానాయికగా హాలీవుడ్ లో కూడా తెరంగేట్రం చేయడానికి రెడీ అవుతోంది. 2022 ముహుర్తం సంవత్సరంగా ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మొదటి ప్రాజెక్ట్ ని వచ్చే ఏడాది ప్రారంభింస్తుంది. ప్రఖ్యాత అమెరికన్ మీడియా ఏజెన్సీ విలియం మోరిస్ ఎండీవర్( డబ్ల్యూఎఈ) తో ఆలియా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. అలియాకి హాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు వస్తున్నాయిట. కానీ అలియాభట్ మాత్రం సెలక్టివ్ గానే వెళ్తోందని అంటున్నారు.
డబ్ల్యూఎంఈ తోనే బెస్ట్ లాంచింగ్ దొరుకుతుందని అలియా ఆ సంస్థతోనే ముందుగా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. డబ్ల్యూఎంఈ హాలీవుడ్ లో విదేశీ నటులు గాల్ గాడోట్.. ఓప్రా..విన్ ప్రే... చార్జీస్ థెరాన్ వంటి నటుల్ని పరిచయం చేసిన సంస్థ. ఇండియా నుంచి ప్రియాంక చోప్రా.. ఐశ్వర్యారాయ్.. మల్లికా షశ్రీరావత్.. ఫ్రిదా పింటో.. శ్రీయ శరన్ లు ఆ సంస్థ ద్వారానే హాలీవుడ్ లో లాంచ్ అయ్యారు. ఇప్పుడు వాళ్ల సరసన అలియా భట్ చేరబోతుంది. ఈ ఆఫర్ తో ఆలియా కూడా గ్లోబర్ స్లార్ గా వెలిగిపోవడం ఖాయమంటూ బాలీవుడ్ మీడియా కథనాలు హీటెక్కిస్తున్నాయి.